GHMC Election Results 2020 : అర్థరాత్రి ఎన్నికల సంఘం ఉత్తర్వులు.. సంచలన ఆరోపణలు చేసిన బండి సంజయ్..

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదం అయ్యాయి. ఈ ఉత్తర్వులపై బీజేపీ రాష్ట్ర ..

GHMC Election Results 2020 : అర్థరాత్రి ఎన్నికల సంఘం ఉత్తర్వులు.. సంచలన ఆరోపణలు చేసిన బండి సంజయ్..
Follow us

| Edited By: Team Veegam

Updated on: Dec 04, 2020 | 9:51 AM

GHMC Election Results 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదం అయ్యాయి. ఈ ఉత్తర్వులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బ్యాలెట్‌పై స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలని ఎన్నికల సంఘం పేర్కొనడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అర్ధరాత్రి సమయంలో సర్క్యూలర్ జారీ చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టు ద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ను ఆపే ప్రయత్నం చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. అంతేకాదు.. తెలంగాణ ఎన్నికల కమిషనర్ చీటింగ్ చేశారంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ రోజు అర్ధరాత్రి వరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సీఎస్, డీజీపీ భేటీ అయ్యారని, ఆ తర్వాతే పోలింగ్ శాతాన్ని ప్రకటించారని సంజయ్ ఆరోపించారు. కావాలనే అర్ధరాత్రి వరకు పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించలేదన్నారు.

Also Read :

GHMC Election Results 2020 : ఎన్నికల కౌంటింగ్ వేళ కీలక పరిణామం.. ఎన్నికల సంఘం ఉత్తర్వులు.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ..