హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

Bandaru Dattatreya takes oath as Governor of Himachal Pradesh, హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ రోజు ఉదయం రాజ్‌భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తరఫున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారోత్సవంలో హిమాచల్ ప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా దత్తాత్రేయ టోపీని ధరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *