మా సినిమాను ఆపడం ప్రజాస్వామ్య వ్యతిరేకం

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించిన ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ మూవీ నిర్మాతలకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నటుడు వివేక్ ఒబెరాయ్, నిర్మాత సందీప్ సింగ్‌, […]

మా సినిమాను ఆపడం ప్రజాస్వామ్య వ్యతిరేకం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 6:37 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించిన ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ మూవీ నిర్మాతలకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నటుడు వివేక్ ఒబెరాయ్, నిర్మాత సందీప్ సింగ్‌, వారి తరఫున లాయర్ హితేశ్ జైన్ ఎన్నికల కమిషన్ ముందు హాజరై తమ వివరణను ఇచ్చారు.

అనంతరం నిర్మాత సందీప్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమాపై ఎన్నికల కమిషన్ లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు తాము సమాధానాలు ఇచ్చామని అన్నారు. తమ మూవీ విడుదలను ఆపేయాలని లేదా వాయిదా వేయాలని చూడటం ప్రజాస్వామ్య వ్యతిరేకమని సందీప్ అన్నారు. బీజేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తమ సొంత డబ్బుతోనే ఈ సినిమాను నిర్మించామని ఆయన చెప్పారు. ఇక ఈ మూవీని నిర్మించడంపై ఎలాంటి రాజకీయ ప్రొపగండా కూడా లేదని, తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని సందీప్ తెలిపారు.

అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత ఈ మూవీకి సంబంధించిన ప్రకటనలు రెండు ప్రముఖ వార్తా పత్రికల్లో వచ్చాయి. దీంతో ఢిల్లీ ఎన్నికల అధికారి కె మహేశ్ మార్చి 20న ’పీఎమ్ నరేంద్ర మోదీ బయోపిక్‌‘ను నిర్మించిన కంపెనీకి, మ్యూజిక్ కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.