అక్కడ కాలేజీ ఫీజులకు బదులు.. కొబ్బరి బొండాలు ఇస్తున్నారట..!

మాయదారి కరోనా వైరస్ పుణ్యమా అని ఎక్కడ లేని సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మహమ్మారి కారణంగా అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

అక్కడ కాలేజీ ఫీజులకు బదులు.. కొబ్బరి బొండాలు ఇస్తున్నారట..!
Follow us

|

Updated on: Nov 04, 2020 | 9:23 PM

Bali Colleges: మాయదారి కరోనా వైరస్ పుణ్యమా అని ఎక్కడ లేని సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మహమ్మారి కారణంగా అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక తాజాగా అలాంటి పరిస్థితే ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో నెలకొంది. టూరిజానికి బాలీ ద్వీపం పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తూ ఉంటారు.

కరోనా కారణంగా టూరిజం మూతపడటంతో అక్కడున్న వారు ఆర్ధికంగా నష్టపోయారు. ఇలాంటి వేళ విద్యార్ధులకు కాలేజీల ఫీజులు చెల్లించడం సాధ్యం కాని పనిగా మారింది. దీనితో సదరు కాలేజీలు వినూత్నంగా అలోచించాయి. కాలేజీ ఫీజులకు బదులుగా కొబ్బరి బొండాలు ఇవ్వాలని సూచించాయి. ఇక ఆయా కాలేజీల యాజమాన్యాలు తీసుకున్న ఈ నిర్ణయానికి మంచి స్పందన రావడంతో కొబ్బరి బొండాలతో పాటు సహజ సిద్దమైన ఉత్పత్తులను కూడా ఫీజులకు బదులు ఇవ్వొచ్చని విద్యార్ధులకు చెబుతున్నాయి.

Also Read: రోహిత్‌.! టీమిండియా కంటే ఐపీఎల్ ముఖ్యమా.?