రచ్చ కాంబో రెడీ : మరోసారి బాలయ్యతో పూరీ !

బాలయ్య అంటేనే ఊర మాస్..పూరీ జగన్నాథ్ అంటే మాస్‌కు కేరాఫ్ అడ్రస్. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘పైసా వసూల్’  అనే సినిమా వచ్చింది.

  • Ram Naramaneni
  • Publish Date - 5:43 pm, Mon, 26 October 20

బాలయ్య అంటేనే ఊర మాస్..పూరీ జగన్నాథ్ అంటే మాస్‌కు కేరాఫ్ అడ్రస్. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘పైసా వసూల్’  అనే సినిమా వచ్చింది. అనుకున్నంతగా ఆడకపోయినా..అభిమానులను మాత్రం బాగా అలరించింది. అయితే ఈ మూవీతో పూరి-బాలయ్యల మధ్య మంచి బాాండింగ్ ఏర్పడింది. బాలయ్యతో లవ్‌లో ఉన్నానంటూ గతంలో సరదా వ్యాఖ్యానించారు పూరీ. ఆయన ఎప్పుడు సినిమా చేద్దామన్నా రెడీ అంటూ బాలయ్య  చెప్పేశారు. కాగా త్వరలో వీరిద్దరి కాంబోలో మూవీకి ముహూర్తం దగ్గర పడినట్లు తెలుస్తోంది.

నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు బాలయ్య మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. పూరీ చెప్పిన లైన్ బాలయ్యకు నచ్చిందట. దీంతో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారట. ‘పైసా వసూల్’ లో బాలయ్యను విభిన్నంగా చూపించి అభిమానుల వద్ద మంచి మార్కులు కొట్టేశాడు పూరీ. మరి వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో మరోసారి బాలయ్యను ఎలా చూపిస్తాడా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Also Read :

ఇది విన్నారా..! భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు

సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్‌గా 200 కి.మీ…