జూ ఎన్టీఆర్‌పై శ్రీభరత్ కామెంట్స్ వెనుక స్కెచ్ ఎవరిది?

Jr NTR Is Not Bigger Than Party: Balayys's Son In Law, జూ ఎన్టీఆర్‌పై శ్రీభరత్ కామెంట్స్ వెనుక స్కెచ్ ఎవరిది?

ఆయన అవసరం మా పార్టీకి లేదు.. లేదంటే లేదు..అదేంటీ.. అంతమాటనేశారు.. ఇంతకీ ఎవరి అవసరం? ఎవరికి అక్కర్లేదు? ఎవరన్నారు?.. అదేగా మీ డౌట్.. అదేనండీ.. యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ గురించి. ఈ మధ్య ఆయన అవసరం మాపార్టీకి లేదంటూ బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడులెండి. అయితే భరత్ ఎందుకలా అన్నాడు.. ఆయన అలా అనడం వెనుక ఎవరున్నారు? ఆ డైలాగ్ రైటర్ ఎవరు? నిజంగానే టీడీపీకి జూ.ఎన్టీఆర్ అవసరం లేదా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఉన్నది 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు.. ఎప్పుడు ఎవరు సైకిల్ దిగిపోతారో తెలీదు.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ క్యాడర్లో సమరోత్సాహం నింపడానికి ఒక చరిష్మాగల నేత కావాలన్న చర్చ సాగుతోంది. అంతే కాదు జూ.ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ కావాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్.. జూ.ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

అయితే జూ.ఎన్టీఆర్ మళ్లీ టీడీపీలో యాక్టివ్ కావాలని పార్టీలోని ఒక వర్గం బలంగా కోరుకుంటోంది. అలాగే పార్టీకి సంబంధం లేకుండా నందమూరి కుటుంబంలో కూడా కొందరు అదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే పార్టీలోని కీలక వర్గం జూ.ఎన్టీఆర్ ని ఎంతగా వ్యతిరేకిస్తోందో భరత్ వ్యాఖ్యలు చెప్పకనే చెప్పాయని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. జూ.ఎన్టీఆర్ వస్తే పార్టీ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తాడన్న భావనతో ఉన్న ఆ వర్గం అసలు ఆయన అవసరమే లేదని ఎక్స్ ఫోజ్ చేసే పనిలో పడిందని టాక్.

అయితే పార్టీలో ఓ వర్గం తనపై వ్యతిరేకంగా ఉందని తెలిసే ఎన్నికల టైమ్ లో ప్రచారం కూడా చేయకుండా జూ.ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నారా అన్న చర్చకూడా సాగుతోంది. ఊహించని విధంగా పార్టీ సంక్షోభంలో కూరుకుపోతుంటే.. ఈ టైమ్ లో జూ.ఎన్టీఆర్ అవసరం లేదంటూ భరత్ కామెంట్స్ చేయడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *