పోస్టుమార్టం తరువాత అసలు నిజాలు తెలుస్తాయి: బాలకృష్ణ

Balakrishna Comments on Kodela SivaPrasada Rao Demise, పోస్టుమార్టం తరువాత అసలు నిజాలు తెలుస్తాయి: బాలకృష్ణ

కోడెల శివప్రసాదరావు మరణం పార్టీకి రాష్ట్రానికి తీరని లోటని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పార్టీకి ఎంతో సేవచేసిన వ్యక్తి ఆకస్మిక మరణం నన్ను షాక్ కి గురి చేసిందని అన్నారు. కోడెల హాస్పిటల్ కి వచ్చేలోపే అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయనను బతికించేందుకు వైద్యులు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని వివరించారు. కాన్సర్ నిరోదానికి  కోడెల ఎంతో సేవ చేసారని కొనియాడారు. అయన మరణం వెనుక ఉన్న అసలు నిజాలు పోస్ట్ మార్టం తరువాత తెలుస్తాయని బాలకృష్ణ స్పష్టం చేశారు.

బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బవసతారకం ఆస్పత్రి నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని బాలకృష్ణ అన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి నిధులు సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. 2000 నుంచి 2009 మధ్యకాలంలో ఈ ఆస్పత్రికి ఛైర్మన్‌గా వ్యవహరించారని గుర్తుచేసుకున్నారు. పలు మంత్రి పదవులు అలంకరించి ప్రజలకు ఎనలేని సేవలందించారన్నారు. నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా తన ముద్ర వేశారని చెప్పారు. ఆయన మృతిని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని బాలకృష్ణ అన్నారు. ఆయన మరణవార్త విన్న వెంటనే సినిమా షూటింగ్‌ రద్దు చేసుకుని వచ్చానని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *