‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్ లో సీనియర్ హీరోలు..?

తమిళ స్టార్ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్ వేద’. 2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. పుష్కర్, గాయత్రీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

కాగా ఈ చిత్రం తెలుగు లో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పలు స్టార్ హీరోల పేర్లు వినిపించినా అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేశారు. అయితే తాజాగా ఈ సినిమా కోసం సీనియర్ హీరోలు బాలకృష్ణ, రాజశేఖర్ ను సంప్రదించారట చిత్ర యూనిట్. దీనిపై అధికారక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

మరోవైపు ప్రస్తుతం రాజశేఖర్ ‘కల్కి’ షూటింగ్ లో బిజీగా ఉంటే.. బాలకృష్ణ ఎలక్షన్స్ హడావుడిలో ఉన్నాడు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *