బాలాకోట్‌లో మళ్ళీ ఉగ్ర క్యాంపులు?

పుల్వామా ఉగ్రఘటనకు ప్రతీకారంగా జైష్-ఎ-మహమ్మద్ నడుపుతున్న ఉగ్రస్థావరాలను భారత వైమానిక దళం ధ్వంసంచేసింది. ఈ దాడులు జరిగిన దాదాపు ఏడు నెలల తర్వాత పాకిస్తాన్ బాలకోట్‌లోని టెర్రర్ క్యాంప్‌లు మళ్లీ చురుకుగా ఉన్నాయని, ఉగ్రవాదులు తిరిగి పుంజుకుంటున్నారని… భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సోమవారం తెలిపారు. ఇటీవల బాలకోట్‌ రీ యాక్టివ్ అయ్యిందన్నారు. భద్రతా బలగాల కళ్లు కప్పి తప్పించుకోవడానికి టెర్రరిస్టులు కొత్త పేరుతో తిరిగి చర్యలు ప్రారంభింస్తున్నారని రావత్ పేర్కొన్నారు. ఈ యేడాది ఫిబ్రవరి […]

బాలాకోట్‌లో మళ్ళీ ఉగ్ర క్యాంపులు?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 23, 2019 | 4:16 PM

పుల్వామా ఉగ్రఘటనకు ప్రతీకారంగా జైష్-ఎ-మహమ్మద్ నడుపుతున్న ఉగ్రస్థావరాలను భారత వైమానిక దళం ధ్వంసంచేసింది. ఈ దాడులు జరిగిన దాదాపు ఏడు నెలల తర్వాత పాకిస్తాన్ బాలకోట్‌లోని టెర్రర్ క్యాంప్‌లు మళ్లీ చురుకుగా ఉన్నాయని, ఉగ్రవాదులు తిరిగి పుంజుకుంటున్నారని… భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సోమవారం తెలిపారు. ఇటీవల బాలకోట్‌ రీ యాక్టివ్ అయ్యిందన్నారు. భద్రతా బలగాల కళ్లు కప్పి తప్పించుకోవడానికి టెర్రరిస్టులు కొత్త పేరుతో తిరిగి చర్యలు ప్రారంభింస్తున్నారని రావత్ పేర్కొన్నారు.

ఈ యేడాది ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లను పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన ముష్కరులు పుల్వామా దగ్గర దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అసువులు బాసిన సైనికుల కోసం కాశ్మీర్ టూ కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా ప్రజలందరు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు 40 మంది వీర జవాన్ల మరణానికి ధీటైన సమాధానం కోసం భారత ప్రజలు ఎదురు చూసారు. తాజాగా వీర జవానుల వీర మరణంపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న బాలాకోట్ దగ్గర ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నారు.

గత కొద్ధి రోజులుగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. శిక్షణ పొందిన ఉగ్రవాదులు  బృందాలుగా విడిపోయి ఎల్‌వోసీ నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కోట్లీ ఉగ్రవాద స్థావరం నుంచి అధీనరేఖ ప్రాంతంలోని నిఖియాల్ సెక్టార్‌కు ఐదుగురు టెర్రరిస్టుల బృందం ఒక వాహనంలో వచ్చినట్లు గుర్తించారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!