భారీ బడ్జెట్‌తో బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణంః  టీటీడీ

తిరుమల పుణ్యక్షేత్రంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తిరుపతిలో బాలాజీ రిజర్వాయర్‌ నిర్మించాలని టీటీడీ నూతన పాలక మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.  చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశంలో 42 అజెండా అంశాలపై సభ్యులు చర్చించారు. ప్రధానంగా తిరుపతి అవిలాల చెరువు, థీమ్‌ పార్కు అభివృద్ధికి గత ప్రభుత్వం కేటాయించిన రూ.80 కోట్ల నిధులను 48 కోట్లు కుదించి మిగిలిన నిధులతో బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. […]

భారీ బడ్జెట్‌తో బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణంః  టీటీడీ
Follow us

|

Updated on: Sep 23, 2019 | 6:31 PM

తిరుమల పుణ్యక్షేత్రంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తిరుపతిలో బాలాజీ రిజర్వాయర్‌ నిర్మించాలని టీటీడీ నూతన పాలక మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.  చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశంలో 42 అజెండా అంశాలపై సభ్యులు చర్చించారు. ప్రధానంగా తిరుపతి అవిలాల చెరువు, థీమ్‌ పార్కు అభివృద్ధికి గత ప్రభుత్వం కేటాయించిన రూ.80 కోట్ల నిధులను 48 కోట్లు కుదించి మిగిలిన నిధులతో బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.  అలాగే టీటీడీలో పనిచేస్తున్న 15వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బోర్డు సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. తిరుపతిలో గరుఢవారాధిపై ఫ్లైఓవర్‌ నిర్మాణానికి సంబంధించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించిన అనంతరం నిధులు కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని వైవీ. సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయానికి గత ప్రభుత్వం కేటాయించిన రూ.150 కోట్లను ప్రస్తు అవసరాల మేరకు రూ. 36 కోట్లకు కుదింపు చేసినట్లు చైర్మైన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిని స్మార్ట్ సిటిగా ప్రకటించిన తరువాత టీటీడీ నిధులు కేటాయింపు చేయ్యడం సమంజసం కాదన్నారు. శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకుడు రమణధీక్షితులు వ్యవహరం కోర్టు పరిధిలో వున్నందున ఆ అంశంపై పాలకమండలిలో చర్చించలేదని వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??