మరోసారి ఎన్జీయార్ పాత్రలో బాలయ్య?

నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మించిన ఎన్టీయార్ బయోపిక్ లో తండ్రి పాత్రను చాలా బాగా పోషించాడు.. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా బాలయ్య యాక్టింగ్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.. అయితే, బాలయ్య మరోసారి తన తండ్రి పాత్రను చేసే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కంగనారనౌత్ నటిస్తున్న జయలలిత బయోపిక్ కోసం ఎన్టీయార్, ఎంజీయార్ పాత్రలకు గానూ నటులని వెతికే పనిలో పడ్డారు చిత్ర యూనిట్ సభ్యులు.. ఎన్టీయార్ పాత్రకి జూనియర్ ఎన్టీయార్ ని […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 7:13 pm, Thu, 21 November 19

నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మించిన ఎన్టీయార్ బయోపిక్ లో తండ్రి పాత్రను చాలా బాగా పోషించాడు.. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా బాలయ్య యాక్టింగ్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.. అయితే, బాలయ్య మరోసారి తన తండ్రి పాత్రను చేసే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కంగనారనౌత్ నటిస్తున్న జయలలిత బయోపిక్ కోసం ఎన్టీయార్, ఎంజీయార్ పాత్రలకు గానూ నటులని వెతికే పనిలో పడ్డారు చిత్ర యూనిట్ సభ్యులు.. ఎన్టీయార్ పాత్రకి జూనియర్ ఎన్టీయార్ ని సెలెక్ట్ చేసారన్న వార్తలు వచ్చినా జూనియర్ ఈ సినిమా చేసేందుకు ముందుకు రావట్లేదంటూ తేలిపోయింది.. దీంతో ఎన్టీయార్ పాత్రకు బాలకృష్ణే బెస్ట్ ఛాయిస్ గా భావిస్తూ అతన్ని సంప్రదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎన్టీయార్ ను మళ్లీ వెండితెరపై ప్రెసెంట్ చేయడానికి బాలకృష్ణ అంగీకరిస్తారా? లేక కథానాయకుడు, మహానాయకుడు పెద్దగా ఆడనందువల్ల ఆ పాత్రను పోషించడం మానేస్తాడా అనేది వేచి చూడాల్సిందే.