Bajaj Auto Record: రికార్డ్ క్రియేట్ చేసిన బజాజ్‌ ఆటో కంపెనీ.. ఈ ఫీట్ సాధించిన తొలి ద్విచక్రవాహన సంస్థగా..

Bajaj Auto Record: ప్రపంచంలోనే రూ.లక్ష కోట్ల మార్కెట్ విలువను సాధించిన తొలి ద్విచక్ర వాహన కంపెనీగా బజాజ్‌ ఆటో

Bajaj Auto Record: రికార్డ్ క్రియేట్ చేసిన బజాజ్‌ ఆటో కంపెనీ.. ఈ ఫీట్ సాధించిన తొలి ద్విచక్రవాహన సంస్థగా..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 11:38 AM

Bajaj Auto Record: ప్రపంచంలోనే రూ.లక్ష కోట్ల మార్కెట్ విలువను సాధించిన తొలి ద్విచక్ర వాహన కంపెనీగా బజాజ్‌ ఆటో రికార్డ్‌ సాధించింది. నేషనల్‌ స్టాక్ ఎక్సేంజ్‌లో బజాజ్‌ ఆటో షేరు 1 శాతం బలపడి రూ. 3,479 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 1,00,670 కోట్లను అధిగమించింది. దీంతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ఆరు నెలల క్రితం లాక్‌డౌన్ వల్ల బజాజ్‌ ఆటో షేరు కూడా నష్టాలను చవిచూసింది. కానీ తిరిగి ఏడాది చివరి నాటికి మళ్లీ ఊపందుకుంది.ఏడాది కాలాన్ని పరిగణిస్తే 11 శాతం లాభపడింది. మార్చి 24న షేరు ధర రూ. 1,789 దిగువన ఏడాది కనిష్టాన్ని తాకింది. కాగా.. దేశీ ద్విచక్ర వాహన రంగంలో మరో దిగ్గజ కంపెనీ హీరోమోటో కార్ప్‌ మార్కెట్‌ విలువ దాదాపు రూ. 62,028 కోట్లు మాత్రమే. ఈ విలువతో పోలిస్తే బజాజ్‌ ఆటో మార్కెట్‌ క్యాప్‌ 63 శాతం అధికంకాగా.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బ్రాండ్‌ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఐషర్‌ మోటార్స్‌ విలువకంటే 43 శాతం ఎక్కువకావడం గమనార్హం! బజాజ్‌ ఆటో చకన్‌(పుణే), వలుజ్‌(ఔరంగాబాద్‌), పంత్‌నగర్‌(ఉత్తరాఖండ్‌)లో ప్లాంట్లను కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచ ద్విచక్ర వాహన రంగంలో మూడో పెద్ద కంపెనీగా బజాజ్‌ ఆటో ఆవిర్భవించింది. త్రిచక్ర వాహన తయారీకి టాప్‌ ర్యాంకులో నిలుస్తోంది. చకన్‌లో నాలుగో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది.