హీరా గ్రూప్ ఎండీకి బెయిల్.. రూ.5 కోట్ల పూచికత్తుతో..

తెలుగు రాష్ట్రాల్లో హీరా గ్రూప్ కేసు పెద్ద సంచలమైన సంగతి తెలిసిందే. అమాయక ప్రజల్ని మోసం చేసి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ హీరా గ్రూప్‌పై ఇప్పటికీ విచారణ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సంస్థ ఎండీ నౌషీరా షేక్‌‌కు తెలంగాణ హైకోర్టు బైలు మంజూరు చేసింది. రూ.5 కోట్ల పూచి కత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడమే కాకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతు పెట్టింది. కాగా, హీరా సంస్థ ఎండీ […]

హీరా గ్రూప్ ఎండీకి బెయిల్.. రూ.5 కోట్ల పూచికత్తుతో..
Follow us

|

Updated on: Dec 25, 2019 | 6:29 PM

తెలుగు రాష్ట్రాల్లో హీరా గ్రూప్ కేసు పెద్ద సంచలమైన సంగతి తెలిసిందే. అమాయక ప్రజల్ని మోసం చేసి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ హీరా గ్రూప్‌పై ఇప్పటికీ విచారణ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సంస్థ ఎండీ నౌషీరా షేక్‌‌కు తెలంగాణ హైకోర్టు బైలు మంజూరు చేసింది. రూ.5 కోట్ల పూచి కత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడమే కాకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతు పెట్టింది.

కాగా, హీరా సంస్థ ఎండీ నౌషీరా షేక్‌‌తో పాటు ఇతర డైరెక్టర్ల పేరిట ఉన్న సుమారు 29,998 కోట్ల విలువగలిగిన స్థిర, చర ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి విదితమే. తెలంగాణ, ఏపీ, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలలో ఉన్న సంస్థ ఆస్తులను అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద ఈడీ ఎటాచ్ చేసింది.