గుడి త‌లుపులు తెరిచిన వేళ‌…బ‌ద్రీనాథ్‌లో భ‌క్తులు !

ప్రసిద్ధి చెందిన సుందర ప్రదేశంగా పేరుగాంచిన ఈ దేవాల‌యంలో తెల్లవారుజామున 4:30 గంటలకు ఆలయం తలుపులు తీశారు నిర్వాహ‌కులు. అంతకు ముందు పూజారులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు.

గుడి త‌లుపులు తెరిచిన వేళ‌...బ‌ద్రీనాథ్‌లో భ‌క్తులు !
Follow us

|

Updated on: May 15, 2020 | 2:18 PM

ప్ర‌పంచ దేశాల‌ను క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప‌ట్టిపీడిస్తోంది. వ్యాక్సిన్ లేని కోవిడ్‌ని నివారించ‌లేక‌, వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు భార‌త్ స‌హా అన్ని దేశాలు లాక్‌డౌన్ మంత్రాన్ని పాటిస్తున్నాయి. చివ‌ర‌కు ఆ దేవుళ్ల‌ను కూడా క‌రోనా వ‌ద‌ల‌క‌పోవ‌టంతో మార్చి నెల 24 నుంచి అన్ని ఆల‌యాల‌ను కూడా మూసివేశారు అధికారులు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అమ‌ల్లో ఉన్న లాక్‌డౌన్ -3 ఈమే 17తో ముగియ‌నుంది. ఆ మ‌ర్నాటి నుంచే లాక్‌డౌన్ -4 కూడా అమ‌ల్లోకి రానుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో దేశంలోని ప్ర‌ముఖ పుణ్య‌ క్షేత్రంలో నేటి నుంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాలు క‌ల్పించారు.

ఉత్తరఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌ ఆలయం తెరుచుకుంది. అలకనందా నది ఒడ్డున నార్‌, నారాయణ్‌ పర్వతాల మధ్య ఉన్న భద్రీనాథ్‌ ఆలయం ప్రసిద్ధి చెందిన సుందర ప్రదేశంగా పేరుగాంచిన ఈ దేవాల‌యంలో తెల్లవారుజామున 4:30 గంటలకు ఆలయం తలుపులు తీశారు నిర్వాహ‌కులు. అంతకు ముందు పూజారులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. కపట్‌ ఓపెనింగ్‌ కార్యక్రమంలో లాక్‌డౌన్‌ కారణంగా ఆలయ ప్రధాన పూజరితో సహా కేవలం 28 మంది మాత్రమే హాజరయ్యారు.

ఆలయం చుట్టూ రంగురంగుల పూల‌తో అందంగా అలంకరించారు. గత ఏడాది ఆలయం తెరిచిన మొదటి రోజు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, ఈ సారి మాత్రం లాక్‌డౌన్‌ కారణంగా ఆ అవకాశం లేదు. ఉత్తరఖండ్ సీఎం త్రీవేంద్రసింగ్‌ రావత్‌, గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ఆలయంలో ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు.