బద్రీనాథుని ఆలయంపై మంచు దుప్పటి!

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం మంచుతో నిండిపోయింది. ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయింది. సాధారణంగానే ఆ ప్రాంతాల్లో.. ఎముకలు కొరికే చలి ఉంటుంది. అందులోనూ ఇప్పుడు వింటర్ సీజన్ అయ్యేసరికి.. నారాయణుడి ఆలయం సగం వరకూ మంచుతో నిండిపోయింది. అయితే ఆ ప్రదేశం మాత్రం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. మంచుతో నిండి ఉన్న ఆలయాన్ని చూసేందుకు ప్రజలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడ దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అంతేకాకుండా.. ఉత్తర భారతంలోని […]

బద్రీనాథుని ఆలయంపై మంచు దుప్పటి!
Follow us

| Edited By:

Updated on: Dec 28, 2019 | 4:18 PM

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం మంచుతో నిండిపోయింది. ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయింది. సాధారణంగానే ఆ ప్రాంతాల్లో.. ఎముకలు కొరికే చలి ఉంటుంది. అందులోనూ ఇప్పుడు వింటర్ సీజన్ అయ్యేసరికి.. నారాయణుడి ఆలయం సగం వరకూ మంచుతో నిండిపోయింది. అయితే ఆ ప్రదేశం మాత్రం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. మంచుతో నిండి ఉన్న ఆలయాన్ని చూసేందుకు ప్రజలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడ దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అంతేకాకుండా.. ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కుఫ్రీ, మనాలి, సోలాన్‌, భుంటర్‌, సుందర్‌నగర్‌, కల్పా తదితర ప్రాంతాల్లో శుక్రవారం సున్నా డిగ్రీల సెల్సియస్‌ కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కీలాంగ్‌లో అయితే రికార్డు స్థాయిలో మైనస్‌ 15 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైందని హిమాచల్‌ప్రదేశ్‌ వాతావరణ శాఖ అధికారి మన్మోహన్‌ సింగ్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో డిసెంబర్‌ 31 నుంచి జనవరి 2 వరకు హిమపాతంతో పాటు వర్షం కూడా పడే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. గత 24 గంటల్లో సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉందని వెల్లడించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!