Breaking News
  • ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. వర్షాలతో ఇసుక కొరత ఏర్పడింది. అప్పుడే దీక్షలు ఎందుకు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి. చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించలేకపోతున్నారు-వంశీ
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • రాఫెల్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు అవాస్తవమని.సుప్రీం తీర్పుతో తేటతెల్లమైంది-బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్‌. మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జఠిల సమస్యలను సామరస్య పూర్వకంగా మోదీ పరిష్కరించారు. తెలంగాణలో అశాంతి, అసంతృప్తి నెలకొంది. అధికార పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారు-లక్ష్మణ్‌
  • ముగిసిన ఆర్టీసీ, పొలిటికల్‌ జేఏసీ సమావేశం.
  • ఇసుక కొరతపై 12 గంటల పాటు దీక్ష చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు బాధితులకు అండగా నిలిస్తే దాడులు చేస్తున్నారు. ఇసుక లేక అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. నాపై కోపంతో అన్న క్యాంటీన్లు మూసేశారు-చంద్రబాబు
  • తిరుమల: సామాన్య భక్తునిగా శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పేర్నినాని. సుపథం మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పేర్ని నాని
  • ఇసుక కొరత వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది నష్టపోయారు. చంద్రబాబు మీద కక్షతోనే భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ పతాకాన్ని అవహేళన చేసింది.సచివాలయాలకు వైసీపీ రంగులేసే జగన్‌కు గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు-ఎంపీ రామ్మోహన్‌నాయుడు

రాంగ్‌ రూట్‌ డ్రైవర్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన లేడీ

రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఓ బస్సు డ్రైవర్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది ఓ లేడీ. ఆ మహిళ ఇచ్చిన డోస్‌కు అంతపెద్ద బస్సుని కాస్త రూట్‌మార్చి తిప్పేశాడు సదరు బస్సు డ్రైవర్‌. ఆ మహిళ చేసిన సాహాసంతో అక్కడి స్థానికులు సైతం విస్తుపోయి చూడాల్సి వచ్చింది. కేరళలో ఓ మహిళ తన స్కూటీపై ప్రయాణిస్తూ..అన్ని ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తూ వెళ్తోంది. కానీ, ఆమెకు ఎదురుగా వచ్చిన ఓ బస్సు డ్రైవర్‌ మాత్రం రాంగ్‌రూట్‌లో వచ్చాడు. ఆ బస్సు ఆమె స్కూటీకి అతి సమీపంగా వచ్చింది. అయినా కూడా ఆమె తన బండి వెనక్కి తిప్పలేదు. కాళు కిందపెట్టి అలాగే చూస్తూ నిలబడిపోయింది. బస్సు ముందుకు కదిలే పరిస్థితి లేదు..ఎందుకంటే..బస్సును మరికాస్త ముందుకు తీస్తే..ఆమెకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కొంత సమయం వరకు బస్సు డ్రైవర్‌ – స్కూటీపై లేడీ ఇద్దరూ ఉన్నచోట ఉన్నట్లుగానే స్తంభించిపోయారు. తానూ సరైన మార్గంలోనే వస్తున్నానని..బస్సు డ్రైవర్‌ మాత్రం లెఫ్ట్‌లో రాకుండా రైట్‌లో వచ్చి తనకు అడ్డుపడ్డాడు..కాబట్టి బస్సు డ్రైవరే తప్పుకోవాలన్నట్లుగా ఆ లేడీ సైలెంట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో చేసేది లేక బస్సు డ్రైవర్‌ కాస్త రూట్‌ మార్చుకుని సరైన మార్గంలో వెళ్లిపోయాడు..ఇదంతా చూస్తున్న అక్కడి జనాలు, వాహనదారులు సైతం కిక్కురు మనకుండా ఉండిపోయారు..రోడ్డుపై జరిగిన సంఘటనను సెల్‌ఫోన్‌ కెమెరాల్లో బంధించిన కొందరు దానిని సోషల్‌ మీడియాలో పెట్టడంతో…ఆ మహిళకు నెటిజన్ల నుండి ప్రశంసలు వెల్లువెతుత్తున్నాయి.