జియో ఫోన్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్..! ఇక ఇతర ఆపరేటర్లకు కాల్ చేస్తే..!

Bad news for Jio users as calls to rival networks won't be free anymore, జియో ఫోన్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్..! ఇక ఇతర ఆపరేటర్లకు కాల్ చేస్తే..!

ఇప్పటి వరకు అన్ లిమిటెడ్‌గా అన్ని నెట్‌వర్క్స్‌ ఆపరేటర్లకు కాల్స్ చేసిన జియో కస్టమర్లకు ఆ సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కి ఉచితంగా కాల్స్ చేసే అవకాశం ఉండదని తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు ఉచితంగా అన్ని ఆపరేటర్లకు కాల్స్ చేసుకున్న కస్టమర్లు.. ఇక నుంచి జియో కాకుండా ఇతర నెట్‌వర్క్స్‌కి కాల్స్ చేస్తే ఛార్జ్‌లు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

అయితే ఇతర ఆపరేటర్లకు చేసిన కాల్స్‌కు చెల్లించిన రుసుముకు బదులుగా.. డేటాను తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) ఛార్జీల విషయంలో ట్రాయ్‌ ఇచ్చిన నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అయితే, జియో నుంచి జియో నెట్ వర్క్ మధ్య చేసుకునే కాల్స్‌కు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని ప్రకటించింది. అంతేకాదు ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు, ల్యాండ్‌ లైన్స్‌ విషయంలో ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. అక్టోబర్‌ 10 తర్వాత రీఛార్జి చేసే వారికి ఈ ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది.

అయితే ఇప్పటి వరకు కస్టమర్ల నుంచి కాల్స్‌కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదని.. కేవలం డేటాకు మాత్రమే వసూలు చేశామని తెలిపింది. అయితే ట్రాయ్ నుంచి ఒత్తిడి మేరకే ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్‌లు వసూలు చేస్తున్నామని తెలిపింది. ట్రాయ్ ఐయూసీ ఛార్జీలు పూర్తిగా ఆపేసిన రోజున ఈ ఛార్జీలను వసూలు చేయబోమని తేల్చిచెప్పింది. ట్రాయ్ ఐయూసీ ఛార్జ్‌లను 1జనవరి, 2020 నుంచి ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం కాల్స్‌కు వసూలు చేసిన మొత్తాన్ని డేటా రూపంలో తిరిగి వినియోగదారులకు అందివ్వనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం కొన్ని టాపప్‌ వోచర్లను కూడా ప్రకటించింది. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని జియో పేర్కొంది. ఈ టాప్ అప్ వోచర్లు 10 నుంచి 100 రూపాయల వరకూ అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *