Breaking News
  • దేశవ్యాప్తంగా 121 మంది దర్యాప్తు అధికారులకు కేంద్ర హోంమంత్రి పతకాలు. దర్యాప్తులో ప్రతిభ చూపిన కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులకు పతకాలను ప్రకటించిన కేంద్రం. సీబీఐ హైదరాబాద్ ఎస్పీ కళ్యాణ్ కు కేంద్ర హోంమంత్రి పతకం.
  • సంజ‌య్ ద‌త్ ఆరోగ్యం గురించి స్పందించిన భార్య మాన్య‌తా ద‌త్‌: భ‌గ‌వంతుడు మ‌రోసారి ప‌రీక్షిస్తున్నాడ‌ని వెల్ల‌డి. ఓర్చుకుంటే ఈ క‌ష్ట‌కాలాన్ని దాట వ‌చ్చ‌ని ధీమా. సంజ‌య్‌దత్ క్షేమాన్ని కోరుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. అన‌వ‌స‌ర‌మైన రూమ‌ర్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరిన మాన్య‌త‌. సంజ‌య్ ఫైట‌ర్ అని కితాబిచ్చిన మాన్య‌త‌. అంద‌రి ప్రార్థ‌న‌లు, ఆశీర్వాదాలు కావాల‌న్న మాన్య‌త‌. పాజిటివిటీని పంచాల‌ని కోరిన మాన్య‌త.
  • విజయవాడ: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ap ప్రభిత్వం ఉత్తర్వులు. హౌస్ సర్జన్, పిజి డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు పెంపు. ఎంబీబీఎస్ విద్యార్థులకు 19,589. పిజి డిగ్రీ విద్యార్థులకు 1 ఇయర్ 44,075, 2 ఇయర్ 46,524, 3 ఇయర్ 48, 973 కు పెంపు.
  • ఉత్తరాఖండ్‌కు పొంచి ఉన్న వర్షాలు, వరదల ముప్పు. భారీ వర్షసూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరిక. భాగేశ్వర్, పిత్తోరాగఢ్, నైనితాల్, ఉద్ధమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్, హరిద్వార్, చమోలీ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం.
  • మణికొండ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ సమీపం లో కార్ ఆక్సిడెంట్. జబర్దస్త్ ఆర్టిస్ట్ అభి bmw కార్ మరో కారు బ్రిజా కార్ ఢీ. బ్రిజా కారును అతివేగంగా అభి ఢీ కొట్టినట్టు ఆరోపిస్తున్న బాధితుడు.
  • హైదరాబాద్ లో థీమ్ పార్కు ల నిర్మాణానికి శంకుస్థాపన . డిల్లీ , పూణె లో తరహాలో సీటీలో ఆరు చోట్ల థీమ్ పార్క్ లు . 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిహెచ్ఎంసి . మూడు నెలలో పార్క్ ల నిర్మాణం పూర్తి చేస్తాం: జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్.
  • చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా జాగర్‌గుండా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్. కోబ్రా 223, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల జాయింట్ ఆపరేషన్. నలుగురు మావోయిస్టులు హతం, మారణాయుధాలు స్వాధీనం.

ఎయిర్‌ ఇండియాకు ఆయిల్ కంపెనీల షాక్.. త్వరలో రాకపోకలకు బ్రేక్..?

Bad news for Air India fliers: Oil cos to discontinue fuel supply at 6 airports from Friday, ఎయిర్‌ ఇండియాకు ఆయిల్ కంపెనీల షాక్.. త్వరలో రాకపోకలకు బ్రేక్..?

ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరో షాక్ తగిలింది. ఈ సారి చమురు కంపెనీల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. తమ కంపెనీలకు ఉన్న బకాయిలను ఈ నెల 18 లోపు చెల్లించాలని.. లేని పక్షంలో ఎయిర్ ఇండియా సంస్థకు ఇంధన సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించాయి. ఈ మేరకు ఇంధనం సరఫరా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్ కంపెనీలు గురువారం ఎయిరిండియాకు లేఖ రాశాయి. దీంతో 18 నుంచి ఎయిర్ ఇండియా విమానాలు నడుస్తాయా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

గత ఎనిమిది నెలలుగా ఎయిర్ ఇండియా ఇంధనానికి డబ్బులు చెల్లించలేదని, ఈ బిల్లుల విలువ రూ.5వేల కోట్లకు చేరుకుందని ఆగస్టులో ఇంధన కంపెనీలు ఎయిరిండియాకు తెలిపాయి. దీంతో కొచ్చి, మొహాలి, పుణె, పట్నా, రాంచీ, విశాఖపట్నం విమానాశ్రయాలకు ఆగస్టు 22న ఇంధన సరఫరా నిలిపివేశాయి. ఆ తర్వాత కేంద్ర పౌరవిమానయాన శాఖ కల్పించుకోవడంతో సెప్టెంబర్‌ 7నుంచి మళ్లీ ఇంధన సరఫరా సేవలను కొనసాగించాయి. ఇక నెలవారీగా ఎయిర్ ఇండియా డబ్బు చెల్లించకుంటే ఆరు ప్రధాన విమానాశ్రయాల్లో ఆయిల్ సరఫరాను నిలిపివేస్తామని ఆయిల్ కంపెనీలు తుది హెచ్చరిక జారీ చేశాయి. ఇప్పటికే 2018-19 సంవత్సరంలో రూ. 8,400 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. అంతేకాదు ప్రస్తుతం రూ. 60 వేల కోట్ల రూపాయల అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమయంలో ఇక ఎయిర్ ఇండియాకు ఆయిల్ కంపెనీలు ఇంధన సరఫరాను నిలిపివేస్తే మరింత నష్టం వాటిల్లనుంది. ఎయిరిండియాలో నెలకొన్న ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంస్థ నష్టాలను తగ్గించడానికి ఎయిరిండియాను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంధన సంస్థలు నిజంగానే ఈ నెల 18 నుంచి ఇంధన సరఫరా నిలిపివేతస్తే.. ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలకు బ్రేకు పడనుంది.

Related Tags