వైద్యుల నిర్లక్ష్యం.. పసిప్రాణం బలి..

ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది. డాక్టర్లు లేకపోయినా.. డెలివరీలు చేసేస్తూ.. శిశువుల ప్రాణాలు తీస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. సిబ్బందే డెలివరీలు చేయడంతో నిజమాబాద్ ఏలూరులో ఇద్దరు శిశువులు మృతి చెందారు.

నిజామాబాద్‌ జిల్లా కమ్మర్ పల్లి ప్రభుత్వాసుపత్రిలో.. డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన ఓ గర్భిణీకి.. వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో.. అక్కడి సూపర్ వైజర్ డెలివరీ చేసింది. దీంతో.. పుట్టిన మగశిశువు మృతి చెందింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే.. తమ బాబు మృతి చెందాడంటూ.. ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు.

మహిళ మూత్ర సమస్యతో బాధపడుతుందని, ప్రసవ సమయంలో శిశువు మెడకు బొడ్డునాళం బిగుసుపోయిందని, తల్లి ప్రాణాలు కాపాడటానికే ప్రసవం చేశామని చెబుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. అటు.. బంధువులు మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ.. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *