చంద్రబాబు సీక్రెట్ వెల్లడించిన భువనేశ్వరి

రాజధాని రైతులకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలను వదిలేసిన చంద్రబాబు దంపతులు మంగళవారం అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. పలు చోట్ల చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా రైతులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు సీక్రెట్ వెల్లడించడంతో పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎర్రబాలెం నుంచి మందడం, కృష్ణాయపాలెం గ్రామాల్లో భువనేశ్వరి చంద్రబాబుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ప్రసంగించిన భువనేశ్వరి చంద్రబాబు అమరావతిని ఎంతగా ఇష్టపడి అభివృద్ధి చేశారో మీకు తెలుసా […]

చంద్రబాబు సీక్రెట్ వెల్లడించిన భువనేశ్వరి
Follow us

|

Updated on: Jan 01, 2020 | 2:17 PM

రాజధాని రైతులకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలను వదిలేసిన చంద్రబాబు దంపతులు మంగళవారం అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. పలు చోట్ల చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా రైతులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు సీక్రెట్ వెల్లడించడంతో పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎర్రబాలెం నుంచి మందడం, కృష్ణాయపాలెం గ్రామాల్లో భువనేశ్వరి చంద్రబాబుతో కలిసి పర్యటించారు.

ఈ సందర్భంగా పలు చోట్ల ప్రసంగించిన భువనేశ్వరి చంద్రబాబు అమరావతిని ఎంతగా ఇష్టపడి అభివృద్ధి చేశారో మీకు తెలుసా అంటూ పలు అంశాలను వెల్లడించారు. ఏ నమ్మకంతో అమరావతి ప్రాంత రైతాంగం తమ భూములను త్యాగం చేసిందో.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించి సఫలమయ్యారని భువనేశ్వరి అన్నారు. దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతిని చేయాలని చంద్రబాబు భావించారని చెప్పారు.

చంద్రబాబుకు రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబానికి ప్రాధాన్యమని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. రైతుల పోరాటానికి తమ కుటుంబం పూర్తిగా అండగా నిలుస్తుందని చెప్పారు. తరతరాలుగా వారసత్వంగా వచ్చిన 34 వేల ఎకరాల భూమిని రైతులు రాష్ట్ర భవిష్యత్ కోసం ఇచ్చారని, ఒక్క వ్యక్తి (చంద్రబాబు) పిలుపునిస్తే వేలాది మంది రైతులు త్యాగానికి సిద్దపడ్డారని ఆమె అన్నారు. రైతులతో పెట్టుకున్న ఎవ్వరూ ఈ ప్రపంచంలో బట్టకట్టలేదని జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు భువనేశ్వరి.

ప్రాణం ఉన్న వరకూ రైతుల పక్షాన చట్టపరంగా, న్యాయ పరంగా పోరాడుతామని చెప్పారు. రాజధానిని నిర్మించడం చేతకాని జగన్ సీఎం ఎందుకు అయ్యాడని భువనేశ్వరి విమర్శించారు. ఇప్పటికే రాజధానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేసిందని, మరో 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రాజధానికి ఒక రూపు వస్తుందని భువనేశ్వరి అంటున్నారు.