గృహ నిర్బంధాలపై చంద్రబాబు ఆగ్రహం

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న తెలుగుదేశం నేతలను గృహ నిర్బంధం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇల్లు విడిచి బయటికి వస్తే అరెస్టులు చేయడాన్ని ఆయన ఖండించారు. కృష్ణా,గుంటూరు జిల్లాలలో టీడీపీ నాయకుల గృహ నిర్బంధంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని ఏరియాలో బంద్ నిర్వహిస్తున్న రైతులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. రైతులకు సంఘీభావంగా నిలుస్తున్న టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. రాజధాని కోసం వేలాది […]

గృహ నిర్బంధాలపై చంద్రబాబు ఆగ్రహం
Follow us

|

Updated on: Jan 07, 2020 | 3:58 PM

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న తెలుగుదేశం నేతలను గృహ నిర్బంధం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇల్లు విడిచి బయటికి వస్తే అరెస్టులు చేయడాన్ని ఆయన ఖండించారు. కృష్ణా,గుంటూరు జిల్లాలలో టీడీపీ నాయకుల గృహ నిర్బంధంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని ఏరియాలో బంద్ నిర్వహిస్తున్న రైతులకు ఆయన సంఘీభావం ప్రకటించారు.

రైతులకు సంఘీభావంగా నిలుస్తున్న టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. రాజధాని కోసం వేలాది కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. రైతులు, రైతుకూలీలకు మద్దతు చెప్పేందుకు వెళ్లకుండా తమ నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది నాయకుల అక్రమంగా నిర్బంధిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పోకడలకు ఇది పరాకాష్ట అని బాబు ఆరోపించారు. రైతులు, మహిళలు, రైతు కూలీలపై అక్రమ కేసులు పెట్టడం గర్హనీయమని వ్యాఖ్యానించారు.

పోలీసు బలగాలతో ప్రజాభీష్టాన్ని కాలరాయలేరన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని చంద్రబాబు సూచించారు. అరెస్ట్ చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని, అక్రమ కేసులు ఎత్తేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..