కర్ణాటకలో బీజేపీ అభ్యర్థి కోసం తెలంగాణలో బాబూమోహన్ ఎన్నికల ప్రచారం

ఈసారి ఎన్నికల ప్రచారంలో బీజేపీ చాలా తెలివిగా దూసుకుపోతోంది. అందుబాటులో ఉన్న ప్రతి నాయకుడితో తారతమ్యాలు లేకుండా ప్రచారం చేయిస్తోంది. తాజాగా టాలీవుడ్ కమెడియన్, మాజీ మంత్రి మోహన్‌బాబు సేవల్ని కూడా ప్రచారంలో ఉపయోగించుకుంది. కర్ణాటక… బెంగళూరులోని… శివాజీనగరలో… చించోళీ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బాబూమోహన్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి ఉమేశ్ యాదవ్‌కి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ చించోళి అనేది… తెలంగాణకు సరిహద్దుల్లోనే ఉంది. చించోళిలో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రచారం చేశాక… తెలంగాణలోని తాండూరుకు వెళ్లారు. చించోళికి చెందిన దాదాపు 3 వేల మంది ఓటర్లు పనుల కోసం అక్కడ ఉంటున్నారు. వాళ్లను ఆకట్టుకోవడానికి యడ్యూరప్ప తెలివైన ఎత్తుగడ వేశారు. బాబుమోహన్‌తో అక్కడ ఎన్నికల ప్రచారం చేయించారు.

ఇటీవల బాబూమోహన్ అంత యాక్టివ్‌గా లేరు. తెలంగాణలో ఎన్నికలు అయిపోవడంతో ఆయన ఇతర కార్యక్రమాలు చూసుకుంటున్నారు. అలాంటి సమయంలో… పక్క రాష్ట్రం నుంచీ యడ్యూరప్ప ప్రచారానికి పిలవగానే, ఎలాంటి అభ్యంతరమూ చెప్పకుండా బాబుమోహన్ ప్రచారానికి వెళ్లారు. దీనిపై బెంగళూరు బీజేపీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *