కషాయ కండువా కప్పుకున్న రెజ్లర్ బబిత

Babita Phogat And Mahavir Phogat Join BJP

కామెన్ వెల్త్ క్రీడాలో గోల్డ్ మెడల్ సాధించిన  ఛాంపియన్ రెజ్లర్ బబిత ఫోగాట్ కషాయ కండువా కప్పుకున్నారు. హరాన్యాకు చెందిన బబిత ఫోగాట్ ఆమె తండ్రి మహావీర్ సింగ్ పోగాట్ ఇద్దరూ సోమవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో వీరు కమలం గూటికి చేరారు. త్వరలో హర్యానా శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరివురు బీజేపీ చేరారు.  బబితా పోగాట్ ఇప్పటి వరకు మూడుసార్లు కామన్ వెల్త్ క్రీడాల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించారు.  మహావీర్ సింగ్ పోగాట్, ఆయన కూతుళ్ల జీవిత కథ ఆధరంగా వచ్చిందే దంగల్ సినిమా.  ఇక ఇటీవల కశ్మీర్ అంశంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బబిత ఎంతగానో సమర్థించారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆమె తన ట్విట్టర్ వేధికగా స్పందించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన క్షణాలను చూడాలేక పోయామని..కానీ, ఇప్పుడు ఆర్టికల్ 370, 35ఏ ల రద్దుతో కశ్మీర్ స్వాతంత్ర్యం పొందడాన్ని చూసే అదృష్టం దక్కిందన్నారు. అయితే, హర్యానాలో మాత్రం బీజేపీ సర్కార్ క్రీడాకారులను చిన్నచూపు చూస్తోందంటూ బబితా గతంలో పలుమార్లు విమర్శలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *