ఈ కామర్స్ రంగంలోకి ‘పతంజలి’.. ఆన్‌లైన్ ద్వారా సరుకులు పంపిణీ..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఆయుర్వేద ఔషధాల తయారీ సంస్థ పతంజలి.. ఈ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టనుంది.

ఈ కామర్స్ రంగంలోకి 'పతంజలి'.. ఆన్‌లైన్  ద్వారా సరుకులు పంపిణీ..!
Follow us

| Edited By:

Updated on: May 15, 2020 | 4:56 PM

Baba Ramdev: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఆయుర్వేద ఔషధాల తయారీ సంస్థ పతంజలి.. ఈ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆన్‌లైన్ ద్వారా కార్యకలాపాలు మరింత విస్తరించాలని భావిస్తోంది.

ప్రసిద్ధ యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలో నడుస్తున్న ఈ సంస్థ.. మరో 15 రోజుల్లో ‘OrderMe’ వెబ్‌సైట్ ద్వారా సరుకులు పంపిణి చేయనుంది. ఆర్డర్ చేసిన కొన్ని గంటల్లోనే డెలివరీ చేస్తామని.. ఎలాంటి డెలివరీ చార్జీలు ఉండవని ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్వదేశీ వస్తువుల పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

మరోవైపు.. పతంజలి ఆయుర్వేద సంస్థ అతి తక్కువ కాలంలో రూ.10వేల కోట్ల టర్నోవర్‌ సాధించిన భారతీయ ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ సంస్థగా పతంజలి రికార్డు సృష్టించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన సంస్థల్ని వెనక్కి నెట్టి అత్యంత ప్రభావశీల సంస్థల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. రాబోయే రోజుల్లో దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థగా అవతరించే దిశగా పతంజలి అడుగులేస్తోంది.