సోని అదృశ్యం: కిడ్నాపర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..?

B.Pharmacy student kidnap case, సోని అదృశ్యం: కిడ్నాపర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..?

నాలుగు రోజుల క్రితం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అపహరణకు గురైన బీఫార్మసీ విద్యార్థిని సోని కేసులో పోలీసులకు కొన్ని క్లూలు లభించాయి. కారులో సోనిని తీసుకెళ్లిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ విజయవాడ వాసి, పాతనేరస్తుడు శ్రీధర్‌ రెడ్డిగా గుర్తించారు. అతడి అసలు పేరు రవి అని నిర్ధారించారు. అంతేకాదు మూడు రాష్ట్రాల్లో రవి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. మరోవైపు కిడ్నాపర్ కోసం పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలను చేపడుతున్నారు.

సోనిని కిడ్నాప్ చేయడానికంటే ముందు అతడు కారును దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. కారు అసలు ఓనర్ రావడంతో నిందితుడు గుర్తింపు పోలీసులకు మరింత సులువైంది. ఇదిలా ఉంటే నాలుగు రోజులైనా తమ కుమార్తె ఆచూకీ దొరకపోవడంతో సోని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

B.Pharmacy student kidnap case, సోని అదృశ్యం: కిడ్నాపర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *