హస్తిన బాటలో అజహర్, కవిత..! కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా..?

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కారెక్కుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఇదే హట్‌టాపిక్. హెచ్‌సీఏ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అజారుద్దీన్ అండ్ ప్యానెల్.. మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్‌ను కలవనుంది. అజారుద్దీన్‌ కలిసేందుకు.. తెలంగాణ ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారని సమాచారం. అయితే.. టీఆర్ఎస్ పరోక్ష సహకారంతోనే హెచ్‌సీఏ ఎన్నికల్లో అజార్ అండ్ పానెల్ విజయం సాధించిందనే మాట వినిపిస్తోంది. కాగా.. మంత్రి కేటీఆర్.. హెచ్‌సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్ గెలుపు వెనుక.. చక్రం […]

హస్తిన బాటలో అజహర్, కవిత..! కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా..?
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 8:16 PM

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కారెక్కుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఇదే హట్‌టాపిక్. హెచ్‌సీఏ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అజారుద్దీన్ అండ్ ప్యానెల్.. మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్‌ను కలవనుంది. అజారుద్దీన్‌ కలిసేందుకు.. తెలంగాణ ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారని సమాచారం. అయితే.. టీఆర్ఎస్ పరోక్ష సహకారంతోనే హెచ్‌సీఏ ఎన్నికల్లో అజార్ అండ్ పానెల్ విజయం సాధించిందనే మాట వినిపిస్తోంది. కాగా.. మంత్రి కేటీఆర్.. హెచ్‌సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్ గెలుపు వెనుక.. చక్రం తిప్పారని సమాచారం. హెచ్‌సీఏ ఎన్నికలకు ముందు కేటీఆర్‌తో పలుమార్లు అజారుద్దీన్ సమావేశమయ్యారనే వార్తలు కూడా వినిపిస్తోన్నాయి. అంతేకాకుండా.. ఇన్‌డైరెక్ట్‌గా అజారుద్దీన్ గెలుపుకు కేటీఆర్ సహకరించారని, ఎన్నికల తరువాత టీఆర్ఎస్‌లో చేరుతానని హామీ ఇచ్చినట్టు.. అనే వార్తలు కూడా జోరుగా షికారు చేస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని భావిస్తున్న అజారుద్దీన్.. కొంతకాలంగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సందర్భంలోనే.. హెచ్‌సీఏ ఎన్నికలు రావడం.. అందులో గెలవడంతో.. టీఆర్ఎస్‌కి చేరువయ్యారు. అలాగే.. అజారుద్దీన్ ఇచ్చిన మాట ప్రకారం ఆయన.. టీఆర్ఎస్‌ చేరడం ఖాయమనే అనిపిస్తోంది. దీంతో.. రేపో.. మాపో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడం లాంఛనమే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. 2009లో ఉత్తరప్రదేశ్ మురాదాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన అజారుద్దీన్, ఆ తర్వాత ఢిల్లీ రాజకీయాలకు స్వస్తి చెప్పి, హైదరాబాద్‌లో ఉంటున్నారు. కాంగ్రెస్ కూడా అజార్‌ను తెలంగాణకే పరిమితం చేసింది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో.. అజారుద్దీన్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ సందర్భంలో గులాబీ బాస్ అండ కూడా దొరకడంతో.. ఆయన పార్టీ మారేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

అయితే.. ఇప్పుడు మరో వార్త కూడా జోరుగా వినిపిస్తోంది. అదేంటంటే.. అజారుద్దీన్‌ను టీఆర్ఎస్‌ పార్టీ పరోక్షంగా మద్దతివ్వడంలో మరో కోణం ఉన్నట్టు తెలుస్తోంది. అజారుద్దీన్‌ను పార్టీలోకి చేర్చుకుని.. అతనికి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టి.. హెచ్‌సీఏ పగ్గాలను.. కవితకు ఇచ్చే ఆలోచనలో.. పార్టీ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలే.. ఎన్నికల్లో ఓడిపోయి.. తెరవెనుక ఉంటున్న కవితకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పవచ్చు. కానీ.. ఇందుకు అజారుద్దీన్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.