బొబ్బిలి కోటలో ఘనంగా ఆయుధపూజ

విజయనగరం జిల్లా చారిత్రక బొబ్బిలి కోటలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోటలో రాజుల కాలం నాటి ఆయుధాలకు పూజలు జరిపి.. అనంతరం స్థానికుల దర్శనార్థం ప్రదర్శించారు. బొబ్బిలి యుద్ధం తో పాటు రాజరిక వ్యవస్థలో రాజులు ఉపయోగించిన ఆయుధాలను బయటకు తీసి శుభ్రపరిచి పూజలు జరిపారు. బొబ్బిలి రాజుల వారసులు అయిన సుజయ కృష్ణ రంగారావు, బేబినాయనల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలో రాజుల కుటుంబీకులతో పాటు అభిమానులు పాల్గొని ఆయుధ ప్రదర్శనను తిలకించి ఆనందం […]

  • Venkata Narayana
  • Publish Date - 12:07 pm, Sat, 24 October 20

విజయనగరం జిల్లా చారిత్రక బొబ్బిలి కోటలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోటలో రాజుల కాలం నాటి ఆయుధాలకు పూజలు జరిపి.. అనంతరం స్థానికుల దర్శనార్థం ప్రదర్శించారు. బొబ్బిలి యుద్ధం తో పాటు రాజరిక వ్యవస్థలో రాజులు ఉపయోగించిన ఆయుధాలను బయటకు తీసి శుభ్రపరిచి పూజలు జరిపారు. బొబ్బిలి రాజుల వారసులు అయిన సుజయ కృష్ణ రంగారావు, బేబినాయనల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలో రాజుల కుటుంబీకులతో పాటు అభిమానులు పాల్గొని ఆయుధ ప్రదర్శనను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా జరిగే ఈ ఆయుధ పూజ ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజులు మాట్లాడుతూ తమ పూర్వీకులు వాడిన ఆయుధాలను ఎంతో జాగ్రత్తగా పరిరక్షించి భవిష్యత్తు తరాల వారికి చరిత్రను గుర్తుచేయటమే తమ ఆశయమని అన్నారు.