మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయం స్థలం: జస్టిస్ రంజన్

దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూసిన సుధీర్ఘ కేసుకు సుప్రీం కోర్టు ముగింపు పలికింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య కేసుపై ఏక గ్రీవ తీర్పు నిచ్చారు. ఈ కేసును దాదాపు అరగంట సేపు.. జస్టిస్ రంజన్ గొగొయ్‌నే స్వయంగా చదివి వినిపించారు. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీం తీర్పు. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని తీర్పు. కాగా.. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ.. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. […]

మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయం స్థలం: జస్టిస్ రంజన్
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2019 | 2:13 PM

దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూసిన సుధీర్ఘ కేసుకు సుప్రీం కోర్టు ముగింపు పలికింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య కేసుపై ఏక గ్రీవ తీర్పు నిచ్చారు. ఈ కేసును దాదాపు అరగంట సేపు.. జస్టిస్ రంజన్ గొగొయ్‌నే స్వయంగా చదివి వినిపించారు. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీం తీర్పు. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని తీర్పు.

కాగా.. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ.. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మసీదు నిర్మాణం కోసం ప్రత్నామ్నాయ స్థలాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేశారు జస్టిస్ రంజన్ గొగొయ్.