రామజన్మభూమి ప్రాంగణంలోకి రామ్‌లల్లా విగ్రహం..

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా ప్రభావం ఉన్నా.. అయోధ్యలో మాత్రం భవ్య రామమందిర నిర్మాణానికి అడుగులు పడ్డాయి. బుధవారం.. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ చేతుల మీదుగా.. అయోధ్య రామజన్మ భూమి ప్రాంగంణంలోకి రామ్ లల్లా విగ్రహం తరలింపు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయ్యేవరకు.. రామజన్మభూమి ప్రాంగణంలోని మానస భవన్‌లో రామ్ లల్లా విగ్రహాలు ఉండనున్నాయి. నవరాత్రి మొదటిరోజు సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్.. భవ్యరామ మందిర నిర్మాణం కోసం రూ.11లక్షల […]

రామజన్మభూమి ప్రాంగణంలోకి రామ్‌లల్లా విగ్రహం..
Follow us

| Edited By:

Updated on: Mar 25, 2020 | 7:18 PM

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా ప్రభావం ఉన్నా.. అయోధ్యలో మాత్రం భవ్య రామమందిర నిర్మాణానికి అడుగులు పడ్డాయి. బుధవారం.. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ చేతుల మీదుగా.. అయోధ్య రామజన్మ భూమి ప్రాంగంణంలోకి రామ్ లల్లా విగ్రహం తరలింపు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయ్యేవరకు.. రామజన్మభూమి ప్రాంగణంలోని మానస భవన్‌లో రామ్ లల్లా విగ్రహాలు ఉండనున్నాయి. నవరాత్రి మొదటిరోజు సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్.. భవ్యరామ మందిర నిర్మాణం కోసం రూ.11లక్షల చెక్ ను ట్రస్టు సభ్యులకు అందజేశారు.

కాగా.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేసే తేదీని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంద. ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామ నవమి రోజున భూమిపూజ చేసే తేదీని ప్రకటిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు గతంలోనే ప్రకటించింది. రామ్ లల్లా విగ్రహాన్ని భక్తులు దగ్గరి నుంచి చూసి రామచంద్రుని ఆశీర్వాదం అందుకోవచ్చని వీహెచ్పీ నేత వినోద్ బన్సల్ తెలిపారు.

కాగా.. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. నేటి నుంచి రామ్ నవవి మేళా జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది రామభక్తులు వస్తారని అంచనా వేశారు. అందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా రెడీ చేశారు. కానీ.. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసింది ప్రభుత్వం.