అయోధ్యలో రియాల్టీ బూమ్, చుక్కలనంటుతున్న భూముల ధరలు

అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. కేవలం నెల రోజుల్లో ఇవి రెట్టింపయ్యాయి. రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరగడానికి ముందు ఇవి నామ మాత్రంగా ఉండగా ఆ కార్యక్రమం జరిగిన అనంతరం అమాంతంగా..

అయోధ్యలో రియాల్టీ బూమ్, చుక్కలనంటుతున్న భూముల ధరలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 21, 2020 | 4:12 PM

అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. కేవలం నెల రోజుల్లో ఇవి రెట్టింపయ్యాయి. రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరగడానికి ముందు ఇవి నామ మాత్రంగా ఉండగా ఆ కార్యక్రమం జరిగిన అనంతరం అమాంతంగా పెరిగినట్టు రియాల్టీ వర్గాలు  తెలిపాయి. ప్రస్తుతం కొన్ని చోట్ల చదరపు అడుగు వెయ్యి రూపాయల నుంచి 1500 రూపాయలు పలుకుతుండగా మరికొన్ని చోట్ల రెండు వేలనుంచి మూడు వేల రూపాయలవరకు పలుకుతోందట. ఇక్కడ ఆలయ నిర్మాణంతో బాటు రానున్న రోజుల్లో త్రీ స్టార్ హోటల్, ఆ తరువాత అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రానుండడంతో రియల్ బూమ్ కొత్త పు తలు తొక్కుతోంది. పైగా అయోధ్యలో వివిధ ప్రాజెక్టులకు కూడా యూపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుండడంతో ఇక అందరి కళ్ళు ఇక్కడి భూములపై పడ్డాయి. ఈ టెంపుల్ టౌన్ లో ఆస్తులు సంపాదించుకోవడానికి అనేకమంది బడా బాబులు, రాజకీయ నాయకులు, కూడా తహతహ లాడుతున్నారని ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు చెబుతున్నారు.