బిగ్ బ్రేకింగ్: అయోధ్యలోనే మందిరం, మసీదు నిర్మాణం

దాదాపు శతాబ్ధంన్నర్రగా వివాదాస్పదమైన అయోధ్య రామజన్మభూమి స్థలం హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. 1856 నుంచి హిందూ- ముస్లిం సంస్థల మధ్య వివాదానికి కారణమైన 2.77 ఎకరాల స్థలాన్ని అయోధ్య చట్టప్రకారం ఏర్పాటుచేసే ఆలయ ట్రస్ట్‌కు అప్పగించాలని సుప్రీం, ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తంతును మూడు నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం నిర్దేశించింది. అదే సమయంలో ముస్లిం మతవిశ్వాసాలకు ప్రాధాన్యతనిస్తూ.. అయెధ్యలోనే ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాదాస్పద […]

బిగ్ బ్రేకింగ్: అయోధ్యలోనే మందిరం, మసీదు నిర్మాణం
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2019 | 12:03 PM

దాదాపు శతాబ్ధంన్నర్రగా వివాదాస్పదమైన అయోధ్య రామజన్మభూమి స్థలం హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. 1856 నుంచి హిందూ- ముస్లిం సంస్థల మధ్య వివాదానికి కారణమైన 2.77 ఎకరాల స్థలాన్ని అయోధ్య చట్టప్రకారం ఏర్పాటుచేసే ఆలయ ట్రస్ట్‌కు అప్పగించాలని సుప్రీం, ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తంతును మూడు నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం నిర్దేశించింది. అదే సమయంలో ముస్లిం మతవిశ్వాసాలకు ప్రాధాన్యతనిస్తూ.. అయెధ్యలోనే ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా చేస్తూ గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. వివాదాస్పద స్థలం మీద తమకు హక్కు ఉందని సున్నీ వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయిందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే మత విశ్వాసాల ఆధారంగా కాకుండా పురావస్తు శాఖ నివేదిక ప్రాతిపదికనే సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించినట్లు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు.