ఇది ‘ విశ్వాస ‘ సమస్య కాదు.. ‘ అయోధ్య ‘ పై జస్టిస్ బాబ్డే

అయోధ్య భూ వివాద కేసును తాము ‘ విశ్వాసానికి ‘ సంబంధించినదిగా పరిగణించడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి చేపట్టనున్న జస్టిస్ బాబ్డే స్పష్టం చేశారు. ఈ అంశాన్ని తేల్చాల్సిన బాధ్యత కోర్టుదేనని, ఇందులోని అంశాలేవీ రాజకీయమైనవి కావని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు రాజకీయకోణంలో తాము దీన్ని చూడడంలేదన్నారు. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకుంటుంది.. ఇది ల్యాండ్ మార్క్ కేసు.. అయితే పొలిటికల్ కాదు.. కొన్ని చిక్కులు ఉండవచ్ఛు.. […]

ఇది ' విశ్వాస ' సమస్య కాదు.. ' అయోధ్య ' పై జస్టిస్ బాబ్డే
Follow us

|

Updated on: Nov 02, 2019 | 1:51 PM

అయోధ్య భూ వివాద కేసును తాము ‘ విశ్వాసానికి ‘ సంబంధించినదిగా పరిగణించడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి చేపట్టనున్న జస్టిస్ బాబ్డే స్పష్టం చేశారు. ఈ అంశాన్ని తేల్చాల్సిన బాధ్యత కోర్టుదేనని, ఇందులోని అంశాలేవీ రాజకీయమైనవి కావని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు రాజకీయకోణంలో తాము దీన్ని చూడడంలేదన్నారు. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకుంటుంది.. ఇది ల్యాండ్ మార్క్ కేసు.. అయితే పొలిటికల్ కాదు.. కొన్ని చిక్కులు ఉండవచ్ఛు.. కానీ వాటిని ఇప్పుడు ప్రస్తావించదలచుకోలేదు అని ఆయన చెప్పారు. ఒక న్యాయమూర్తిగా మీరు ప్రత్యేకంగా ఒక పిటిషనర్ కి అనుకూలంగా తీర్పునిస్తారా అని ప్రశ్నించగా.. తన ముందుకు వచ్చిన కేసును కోర్టు నిష్పక్షపాతంగా నిర్ణయిస్తుంది.. అంతే.. అని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ నెల 17 న రిటైర్ కానున్నారు. ఆ రోజున ఆయన ఈ కేసుపై తుది తీర్పునివ్వవచ్ఛు. ఇదిలా ఉండగా.. అయోధ్య అంశంపై కోర్టు తుది తీర్పునివ్వనున్న నేపథ్యంలో రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉంచాల్సిందిగా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ముస్లిములను కోరింది. ఈ మేరకు మౌలానా ఖాలిబ్ రషీద్ ఫిరంగి మహాలీ అభ్యర్థించారు. దేశంలోని ఇమామ్ లంతా ముస్లిములకు ఈ సూచన చేయాలన్నారు. ఇది అత్యంత సున్నితమైన కేసని, మొత్తం దేశమంతా సుప్రీంకోర్టు తీర్పుకోసం ఎదురుచూస్తోందని, అందువల్ల ప్రతి పౌరుడూ ఆ తీర్పును గౌరవించాలని ఆయన అన్నారు. మతపరమైన సెంటిమెంట్లను భంగపరిచే ఎలాంటి అంశాలనూ లేవనెత్తరాదని మౌలానా విజ్ఞప్తి చేశారు.