అయోధ్యలో ఇక రాముడి పేరిట అంతర్జాతీయ విమానాశ్రయం !

అయోధ్యలో నిర్మించబోయే విమానాశ్రయానికి రాముడి పేరే పెట్టాలని యూపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా కూడా దీన్నితీర్చిదిద్దనున్నారు.

అయోధ్యలో ఇక రాముడి పేరిట అంతర్జాతీయ విమానాశ్రయం !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 09, 2020 | 6:32 PM

అయోధ్యలో నిర్మించబోయే విమానాశ్రయానికి రాముడి పేరే పెట్టాలని యూపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా కూడా దీన్నితీర్చిదిద్దనున్నారు. వచ్ఛే ఏడాది డిసెంబరు 31 నాటికి విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రామాలయ నిర్మాణం ముగిశాక అయోధ్యకు దేశీయంగా, విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున టూరిస్టులు, ప్రజలు వస్తారని భావిస్తున్నారు. ఈ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కల్పించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనను రూపొందించామని, దాన్ని సంబంధిత అధికారులకు పంపామని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. గత మే నెలలోనే సర్వే ను చేపట్టామని, ఎయిర్ పోర్టు నిర్మాణానికి రూ. 525 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశామని ఆయన చెప్పారు.