అయోధ్య భూమిపూజ ప్రసారాలపై అంక్షలు..!

అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన జరిగే రామమందిరం భూమిపూజ జరగనున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ముఖ్యంగా భూమి పూజ కార్యక్రమాల ప్రసారాలపై టీవీ వార్తా చానళ్లకు పలు మార్గదర్శకాలు జారీచేసింది.

అయోధ్య భూమిపూజ ప్రసారాలపై అంక్షలు..!
Follow us

|

Updated on: Jul 30, 2020 | 1:44 AM

అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన జరిగే రామమందిరం భూమిపూజ జరగనున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ముఖ్యంగా భూమి పూజ కార్యక్రమాల ప్రసారాలపై టీవీ వార్తా చానళ్లకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. అయోధ్య నుంచి ప్రసారం చేసే చర్చా కార్యక్రమాల్లో ‘మందిరం–మసీదు వివాదం’ సంబంధించిన కక్షిదారులెవరూ ఉండరాదని షరతు విధించింది. భూమిపూజ రోజున చానళ్లు చేపట్టే చర్చలు, ఇతర కార్యక్రమాల్లో ఏమతానికీ లేదా వ్యక్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఉండరాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా చానళ్లు ముందుగా మేజిస్ట్రేట్‌ నుంచి అనుమతి తీసుకోవల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అన్ని వార్తా చానళ్లకు మార్గదర్శకాలను జారీ చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.

మరోవైపు, రామజన్మ భూమి నిర్మాణంలో పాలుపంచుకోవాలనుకునే వారు వెండి తోపాటు ఇతర లోహాలతో తయారు చేసిన ఇటుకలను ఆలయానికి విరాళంగా ఇవ్వవద్దని రామాలయ ట్రస్టు కోరింది. భూమిపూజను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భక్తులు నుంచి ఇప్పటికే సేకరించిన ఒక క్వింటాల్‌ వెండి, ఇతర లోహాలతో తయారైన ఇటుకలను బహూకరించారని ఆలయ ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. వీటిని ఆలయంలో భద్ర పరచడానికి గానీ, ఈ ఇటుకల్లో స్వచ్ఛతను పరీక్షించడానికి గానీ తమ వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేవన్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నగదు రూపంలో విరాళాలను ఆలయ బ్యాంకు అకౌంట్‌లో జమ చేయాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అటు, రామజన్మ భూమి పూజా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఇళ్లల్లో ఉండి విక్షేంచాలని ఆలయ కమిటీ కోరింది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!