Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

బ్రేకింగ్ : ఆయేషా మీరా డెడ్‌బాడీకి ‘రీ-పోస్టుమార్టమ్‌’..!

Ayesha Meera murder case Update, బ్రేకింగ్ : ఆయేషా మీరా డెడ్‌బాడీకి ‘రీ-పోస్టుమార్టమ్‌’..!

‘దిశ’ ఘటన దేశ వ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు రేపిందో తెలిసిందే. నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో మెజార్టీ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ డబ్బున్న బడాబాబులు, రాజకీయ నేతల కొడుకులు కూడా తప్పులు చేస్తే..  పోలీసులు, ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తారా  అనే ప్రశ్నలు కూడా  ఉత్పన్నమవుతున్నాయి. దిశ ఇన్సిడెంట్ తర్వాత నిర్భయ దోషుల మరణశిక్ష విషయంలో కదలికలు ఫాస్ట్‌గా జరిగాయి. త్వరలోనే వారిని ఉరి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏపీ ప్రభుత్వం మహిళల భద్రతకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. విమెన్ సేఫ్టీ చట్టంలో విప్లవాత్మక  మార్పులు తీసుకువచ్చే చారిత్రాత్మక బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం.. మహిళలు, చిన్నారులపై అత్యాచారం, యాసిడ్ దాడుల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడేవారికి, కచ్చితమైన ఆధారాలుంటే 21 రోజుల్లోనే  ఉరి శిక్ష విధించేలా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది. 

మరోవైపు ఏపీలో 12 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసు విషయంలో  సీబీఐ కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. త్వరలోనే ఆయేషా మీరా డెడ్‌బాడీకి ‘రీ-పోస్టుమార్టమ్‌’ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సీబీఐ..లోకల్ ఆఫీసర్స్‌‌తో సంప్రదింపులు జరుపుతోంది. డిసెంబరు 20 లోగానే ‘రీ-పోస్టుమార్టమ్‌’ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నట్లు సమాచారం.