మీకు క్రెడిట్ కార్డు ఉందా.. అయితే.. ఫ్లైట్ టికెట్ ఫ్రీ..!

Axis Bank launching Magnus Credit Card for the lifestyle spender, మీకు క్రెడిట్ కార్డు ఉందా.. అయితే.. ఫ్లైట్ టికెట్ ఫ్రీ..!

ప్రముఖ బ్యాంక్ యాక్సిస్‌.. వినియోగదారులకు.. ఓ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. ఈ బ్యాంక్ తాజాగా.. మరో కొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. దానిపేరు ‘మాగ్నస్ క్రెడిట్ కార్డ్’. నార్మల్ క్రెడిట్ కార్డులానే.. దీన్ని కూడా.. లైఫ్‌స్టైల్, షాపింగ్, ట్రావెల్, డైనింగ్, మూవీస్.. తదుపరి రకాల సేవలు పొందవచ్చు.

కాగా.. ‘యాక్సిస్ మాగ్నస్ క్రెడిట్ కార్డు’ ఉన్నవారు ‘విమానం’లో ఫ్రీగా ప్రయాణించే సౌకర్యం కల్పించింది ఈ సంస్థ. ఈ కార్డు ఉంటే ప్రతీ ఏడాది.. ట్రావెల్ బెనిఫిట్స్ కింద ప్రతీ ఏడాది ఫ్లైట్ టికెట్ పొందవచ్చు. అంతేకాదండోయ్.. ఈ కార్డుతో.. చెకిన్, ఇమిగ్రేషన్, సెక్యూరిటీ వంటి ప్రాసెస్‌లను తొందరగా పూర్తి చేసుకోవచ్చట.

అంతేకాకుండా.. ఈ కార్డువల్ల చాలా ఉపయోగాలున్నాయి అవి:

1. బుక్‌మైషో ఫ్లాట్‌ఫామ్‌పై ఒక టికెట్ బుక్‌ చేసుకుంటే.. మరో టికెట్‌ను ఉచితంగా పొందవచ్చంట.

2. అలాగే.. క్యాష్ విత్‌డ్రాపై ఎలాంటి చార్జీలు ఉండవు.

3. ఇతర కార్డుల కన్నా.. యాక్సిస్ మాగ్నస్ క్రెడిట్ కార్డుకు తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి.

4. ఎయిర్ యాక్సిడెంట్ కవరేజ్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

5. కాగా.. కార్డు ద్వారా ఒక ఏడాదిలో 15 లక్షలకు పైగా ఖర్చు చేస్తే.. కార్డు ఫీజు మాఫీ చేస్తారు.

6. ఈ కార్డుతో ఫారెక్స్ చార్జీలు తక్కువగా ఉంటాయి.

అయితే.. ఈ కార్డు దాదాపు రూ.18 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారే ఈ కార్డు తీసుకోవాడానికి అర్హులని.. యాక్సిస్ బ్యాంకు నిర్వాహకులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *