Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 2,07615. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 100303. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5,815. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు. 353, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీబీఐ. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం అతనిపై దాడి చేయడం, సెల్ ఫోన్ పగుల గొట్టడం, బెదిరింపులకు దిగినట్టు డాక్టర్ సుధాకర్ పై అభియోగాలు.
  • తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టులో విచారణ ఏపీ నుంచి తెలంగాణ కి రిలీవ్ అయిన ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులం. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ లోని పని చేయాలని కోరుకుంటున్నామని తెలిపిన ఉద్యోగులు.
  • వైద్య కళాశాలలను భయపెడుతున్న కరోనా. హైదరాబాద్ లో మూడు వైద్య కళాశాలల్లో బయటపడిన కరోనా పాజిటివ్ కేసులు. కరోనా పాజిటివ్స్ లో ఎక్కువ మంది హాస్టల్ విద్యార్థులు . అత్యవసర చర్యలు చేపట్టిన వైద్య కళాశాలలు.
  • టీవీ9 తో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ 200 సయ్యద్ ఉమర్ జలీల్ లాక్‌డౌన్‌ నిబంధనల మధ్య జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. పరీక్షలు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగాయి.
  • హైద్రాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత . 70 గ్రాముల కొకెయిన్ పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు . తిరుమలగిరి లో తరుణ్ , అమిత్ లను పట్టుకున్న అధికారులు . మాస్క్ లకోసం బెంగుళూర్ కు ఇంటర్స్టెట్ పాస్ తో వెళ్లిన యువకులు . బెంగుళూర్ లో నైజీరియన్ దగ్గర కోకయున్ తెచ్చుకున్న యువకులు.

‘అ’ సీక్వెల్.. సీతకు జోడిగా స్టార్ హీరో!

Top Stars In Awe Sequel, ‘అ’ సీక్వెల్.. సీతకు జోడిగా స్టార్ హీరో!

హీరో నాని నిర్మాతగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం ‘అ’. గ‌త ఏడాది విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు కూడా రాబ‌ట్టింది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యామీనన్, కాజల్ అగ‌ర్వాల్‌, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు ముఖ్య పాత్ర‌ల‌లో కనిపించరు. ఈ చిత్రం ఇటీవ‌ల రెండు జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడట దర్శకుడు ప్రశాంత్ వర్మ.

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని టాక్. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘అ’ మంచి విజయం సాధించగా.. దాని సీక్వెల్‌ ఒకవేళ సెట్స్ పైకి వెళ్తే.. అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉంటాయి.

Related Tags