Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

ఆధార్ సేఫ్టీకి కొత్త ఫీచర్.. ఇలా చేస్తే సరి..

ఆధార్ ఇప్పుడు ఏ పని కావాలన్నా ఆధార్ తోనే ముడిపడి ఉంది. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా.. పాన్ కార్డ్ తీసుకోవాలన్నా.. మొబైల్ తీసుకోవాలన్నా.. అన్నిటికి ఆధార్ నెంబరే ఆధారం. ఆధార్ లేనిదే ఏ పని జరగదు. అందుకే ఆధార్‌ను పుట్టిన పిల్లవాడి నుంచి ముసలివారు దాకా అందరూ తీసుకుంటున్నారు. అయితే ఆధార్ భద్రత పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆధార్ వివరాలను చాలా సులభంగా దొంగతనం చేసి దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో భద్రత గురించి అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇకపై అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) చెబుతోంది. ఆధార్ నంబర్‌ను లాక్, అన్ లాక్ చేసుకునే కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక వ్యక్తి తన ఆధార్‌ నంబర్‌ను లాక్ చేసుకోవడం వల్ల ఇతరులు కనిపెట్టలేరు. అయితే ఒక్కసారి లాక్ చేసిన తర్వాత మరే ఇతర అవసరాలకు ఉపయోగించలేదు. మరలా అన్ లాక్ చేసి యూజ్ చేసుకోవచ్చు.

ముందుగా ఆధార్ నంబర్‌ను లాక్ చేసేముందు వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోవాలి. తరువాత యూఐడీఏఐ వెబ్‌సైట్ నుండి లేదా ఎస్ఎంఎస్ ద్వారా వర్చువల్ ఐడీని క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే www.uidai.gov.in లోకి వెళ్తే సరిపోతుంది. ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోతే లేదా యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోతే SMS ద్వారా ఆధార్ నంబర్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేయొచ్చు. మొబైల్ నంబర్ నుంచి 1947 కు SMS పంపడం ద్వారా కూడా ఆధార్ నంబర్‌ను లాక్ / అన్‌లాక్ చేసుకోవచ్చు.

ఆధార్ లాక్ చేయడం కోసం :

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 1947కి ఎస్ఎంఎస్ పంపాలి.
GETOTP అని టైప్ చేసి ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలను జోడించి UIDAIకి SMS పంపాలి.
UIDAI నుంచి ఓటీపీ SMS ద్వారా వస్తుంది.
ఓటీపీ వచ్చాక LOCKUID అని టైప్ చేసి ఆధార్ నెంబర్ లోని చివరి నాలుగు డిజిట్స్‌తో పాటు ఓటీపీని SMS చేయాలి.
SMS చేరిన వెంటనే UIDAI ఆధార్ నెంబర్‌ని లాక్ చేస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి కన్ ఫర్మేషన్ SMS వస్తుంది.

ఆధార్ అన్ లాక్ చేయడం కోసం:

రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 1947కి SMS చేయాలి. GETOTP అని టైప్ చేసి ఆరు అంకెల వర్చువల్ ఐడీ నెంబర్ జోడించి ఎస్ఎంఎస్ పంపాలి.
UIDAI నుంచి వెంటనే ఆరు అంకెల ఓటీపీ SMS ద్వారా వస్తుంది.
UNLOCKUID అని టైప్ చేసిన ఆరు అంకెల వర్చువల్ ఐడీ నెంబర్ టైప్ చేసి, దానితోపాటు ఓటీపీని జతచేసి SMS పంపాలి.
రెండో ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే UIDAI ఆధార్ నెంబర్‌ని అన్ లాక్ చేస్తారు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి కన్ఫర్మేషన్ మేసేజ్ వస్తుంది.