శ్రీలంక క్రికెటర్ అరుదైన ఘనత!

చెస్టర్‌ లీ స్ట్రేట్‌: శ్రీలంక ఆటగాడు ఆవిష్క ఫెర్నాండో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. ఫెర్నాండో (100; 103 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో.. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 338 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో వన్డే ఫార్మాట్‌లో శ్రీలంక తరపున అత్యంత పిన్న […]

శ్రీలంక క్రికెటర్ అరుదైన ఘనత!
Follow us

|

Updated on: Jul 01, 2019 | 9:02 PM

చెస్టర్‌ లీ స్ట్రేట్‌: శ్రీలంక ఆటగాడు ఆవిష్క ఫెర్నాండో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. ఫెర్నాండో (100; 103 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో.. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 338 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో వన్డే ఫార్మాట్‌లో శ్రీలంక తరపున అత్యంత పిన్న వయసులో సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు.

చండిమల్‌(20 ఏళ్ల 199 రోజుల వయసు), ఉపుల్‌ తరంగా(20 ఏళ్ల 212 రోజుల వయసు)లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఆవిష్క ఫెర్నాండో(21 ఏళ్ల 90 రోజుల వయసు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఈ వరల్డ్‌కప్‌లో శ్రీలంక సాధించిన మొదటి సెంచరీ  కూడా ఇదే కావడం విశేషం. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ ద్వారా వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన ఫెర్నాండో.. ఇప్పటివరకు తొమ్మిది వన్డే ఇన్నింగ్స్‌ ఆడి 328 పరుగులు సాధించాడు.