సంస్కరణలే ధ్యేయంగా నాలుగో ప్యాకేజీ.. ఏవియేషన్, టూరిజం రంగాలకు ప్రోత్సాహకాలు

ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షలకోట్ల ఎకనమిక్ ప్యాకేజీలో భాగంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగో రోజైన శనివారం.. ఏవియేషన్, టూరిజం రంగాలకు ప్రోత్సాహకాలు, సంస్కరణల ఆవశ్యకతను వివరించారు.  గ్లోబల్ మార్కెట్ కు అనుగుణంగా దేశీయంగా సంస్కరణల ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఈ దిశగా ప్రధాని మోదీ సంస్కరణల వేగాన్ని పెంచారని ఆమె చెప్పారు. ఒకే దేశం-ఒకే మార్కెట్ అనే విధానాన్ని చేపడుతున్నామని, సంస్కరణల ద్వారానే పెట్టుబడులను ఆకర్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆమె అన్నారు. […]

సంస్కరణలే ధ్యేయంగా నాలుగో ప్యాకేజీ.. ఏవియేషన్, టూరిజం రంగాలకు ప్రోత్సాహకాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 16, 2020 | 5:08 PM

ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షలకోట్ల ఎకనమిక్ ప్యాకేజీలో భాగంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగో రోజైన శనివారం.. ఏవియేషన్, టూరిజం రంగాలకు ప్రోత్సాహకాలు, సంస్కరణల ఆవశ్యకతను వివరించారు.  గ్లోబల్ మార్కెట్ కు అనుగుణంగా దేశీయంగా సంస్కరణల ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఈ దిశగా ప్రధాని మోదీ సంస్కరణల వేగాన్ని పెంచారని ఆమె చెప్పారు. ఒకే దేశం-ఒకే మార్కెట్ అనే విధానాన్ని చేపడుతున్నామని, సంస్కరణల ద్వారానే పెట్టుబడులను ఆకర్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆమె అన్నారు. పాలనా సంస్కరణల్లో మోదీ ఎప్పుడూ ముందుంటారని చెప్పినఆమె.. ఎనిమిది సెక్టార్ల గురించి ప్రస్తావించారు. చిన్న నగరాలకు కూడా వైమానిక సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఉదయ్ పథకం ద్వారా ఇందుకు పూనుకొంటున్నట్టు ఆమె చెప్పారు.

కాగా-శనివారంనాటి తన ప్రసంగంలో నిర్మలాసీతారామన్ ప్రధానంగా ఎనిమిది రంగాల గురించి ప్రస్తావించారు. కోల్ (బొగ్గు), మినరల్ (ఖనిజాలు), సివిల్ ఏవియేషన్ (పౌర వైమానిక రంగం), కేంద్ర పాలిత ప్రాంతాల్లో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, ఎటామిక్ ఎనర్జీ, డిఫెన్స్ ప్రొడక్షన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎఫ్ డీ ఐ, ఇన్వెస్టిమెంట్స్.. వీటి గురించి పేర్కొన్నారు.

బొగ్గు రంగంలో 50 వేల కోట్ల పెట్టుబడి, ఈ రంగంలో ప్రభుత్వ ఆధిపత్యానికి చెల్లుచీటీ, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, ప్రధాన సంస్కరణాలుగా ఉన్నాయన్నారు.

ఇంకా ఆమె ప్రస్తావించిన ప్రధాన అంశాల్లో కొన్ని..

50 బొగ్గు బ్లాకుల వేలం

న్యూ మైనింగ్ ఫెసిలిటీ

ఓపెన్, ట్రాన్స్ పెరెంట్ వేలం ద్వారా 500 మైనింగ్ బ్లాకులకు అనుమతి

అల్యుమినియం ఇండస్ట్రీకి తలెత్తుతున్న పోటీని తట్టుకునేందుకు బాక్సయిట్, కోల్ మినరల్ బ్లాకులకు అనుమతి

నోటిఫైడ్ ఆయుధాల దిగుమతికి స్వస్తి

దేశీయ ఆయుధాల ఉత్పత్తికి ప్రోత్సాహం

డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ లో ఎఫ్ డీ ఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు

డిఫెన్స్ ప్రొడక్షన్ లో స్వావలంబన

ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీబోర్డు ఏర్పాటు

5 లక్షల హెక్టార్లలో 3376 ఇండస్ట్రియల్ పార్కుల గుర్తింపు