క్రైమ్ రికార్డ్స్: సగటున ఒక్క రోజునే 91 అత్యాచారాలు!

సగటున ఒక్క రోజులో భారతదేశం మొత్తం మీద 80 హత్యలు, 91 అత్యాచారాలు, 289 కిడ్నాప్‌లు నమోదవుతున్నాయట. 2018లో దేశంలో జరిగిన నేరాలపై.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో కఠోరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. 2018లో మొత్తం మీద నేరాల సంఖ్య సగటున 1.3 శాతం ఎక్కువ కాగా.. ప్రతి లక్ష జనాభాకు నమోదైన కేసుల సంఖ్య మాత్రం తగ్గిందని ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో వెల్లడించింది. కాగా.. దేశం […]

క్రైమ్ రికార్డ్స్: సగటున ఒక్క రోజునే 91 అత్యాచారాలు!
Follow us

| Edited By:

Updated on: Jan 10, 2020 | 10:07 PM

సగటున ఒక్క రోజులో భారతదేశం మొత్తం మీద 80 హత్యలు, 91 అత్యాచారాలు, 289 కిడ్నాప్‌లు నమోదవుతున్నాయట. 2018లో దేశంలో జరిగిన నేరాలపై.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో కఠోరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. 2018లో మొత్తం మీద నేరాల సంఖ్య సగటున 1.3 శాతం ఎక్కువ కాగా.. ప్రతి లక్ష జనాభాకు నమోదైన కేసుల సంఖ్య మాత్రం తగ్గిందని ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో వెల్లడించింది.

కాగా.. దేశం మొత్తం మీద వేర్వేరు కారణాల వల్ల సుమారు 1.34 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నవారు 7.7 శాతమని గణాంకాలు తెలిపాయి. అయితే 2017 సంవత్సరం నాటి రైతుల ఆత్మహత్యలతో పోల్చితే 2018లో 3.6 శాతం ఎక్కువ అయ్యాయట. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారిలో గతేడాది సుమారు 10,349 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది.

అలాగే.. దేశవ్యాప్తంగా రోజుకి 91 మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో దాదాపు మైనర్లే ఉండటం అమానుషం. అయితే.. అభం శుభం తెలియని చిన్న చిన్న పిల్లలు ఎక్కువగా అత్యాచారానికి గురవుతున్నారట. 2018లో అత్యాచారాలు 51.9 శాతం పెరిగాయట. ఇక రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయేవారి సంఖ్య 2018లో 30.3 శాతం పెరిగిందట.

ఇకపోతే ఇతరులతో వివాదాల కారణంగా అత్యధిక హత్యలు జరిగినట్టు క్రైమ్ రికార్డు నివేదిక పేర్కొంది. 2018లో 29,017 హత్య కేసులు నమోదు కాగా.. ఇది 2017లో 1.7 శాతం అధికమని నివేదిలో పేర్కొన్నారు నిర్వాహకులు. వ్యక్తిగత ద్వేషం, పగ, లాభాపేక్ష వంటి కారణాలతో 2018లో 6,875 మంది హత్యకు గురయ్యారు. కాగా.. కిడ్నాపింగ్, ఎత్తుకెళ్లడం వంటి నేరాల సంఖ్య 2018లో ఎక్కువైంది. 2017లో మొత్తం 95,893 కిడ్నాప్ కేసులు నమోదవ్వగా.. 2018లో ఈ సంఖ్య 10.3 శాతం పెరిగింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..