థానోస్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ బద్దలు..!

హాలీవుడ్ సినిమా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్‌’ దెబ్బకు రికార్డులు బద్దలవుతున్నాయి. ఈ సినిమాలో మెయిన్ విలన్ థానోస్ చిటికేస్తే మనుషులు ఆవిరైపోయినట్లు.. రికార్డులు కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో 1.2 బిలియన్‌ డాలర్లు (రూ.8,384 కోట్లు) కొల్లగొట్టి, చరిత్ర సృష్టించింది. కేవలం అమెరికా, కెనడా దేశాల్లోనే మూడు రోజులకు 350 మిలియన్ డాలర్లు కొల్లగొట్టినట్లు డిస్నీ నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా చైనా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, […]

థానోస్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ బద్దలు..!
Follow us

|

Updated on: Apr 29, 2019 | 7:20 PM

హాలీవుడ్ సినిమా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్‌’ దెబ్బకు రికార్డులు బద్దలవుతున్నాయి. ఈ సినిమాలో మెయిన్ విలన్ థానోస్ చిటికేస్తే మనుషులు ఆవిరైపోయినట్లు.. రికార్డులు కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో 1.2 బిలియన్‌ డాలర్లు (రూ.8,384 కోట్లు) కొల్లగొట్టి, చరిత్ర సృష్టించింది. కేవలం అమెరికా, కెనడా దేశాల్లోనే మూడు రోజులకు 350 మిలియన్ డాలర్లు కొల్లగొట్టినట్లు డిస్నీ నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా చైనా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, దక్షిణాఫ్రికా, ఇతర 38 దేశాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త చరిత్ర సృష్టించింది. చైనాలో ‘ఎండ్‌గేమ్‌’ 330.5 మిలియన్‌ డాలర్లు సాధించింది. ముఖ్యంగా ‘మహా థానోస్’ విధ్వంసాన్ని చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారని డిస్నీ నిర్మాత మీడియాకు తెలిపారు.

మరోవైపు అవెంజర్స్ ఎండ్ గేమ్ భారత్ లో  మూడు రోజుల్లో  రూ.157.20 కోట్లు (2845 స్క్రీన్లు) రాబట్టింది. శుక్రవారం రూ.53.10 కోట్లు, శనివారం రూ.51.40 కోట్లు, ఆదివారం రూ.52.70 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక ఈ వసూళ్లు ఇన్ఫినిటీ వార్ కంటే 66.07 శాతం ఎక్కువ కావడం విశేషం.