హాలీవుడ్ ప్రముఖ నటి డయానా రిగ్ కన్నుమూత

హాలీవుడ్ ప్రముఖ నటి డయానా రిగ్(82) తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 82 సంవత్సరాలు. 

హాలీవుడ్ ప్రముఖ నటి డయానా రిగ్ కన్నుమూత
Follow us

|

Updated on: Sep 11, 2020 | 3:11 PM

హాలీవుడ్ ప్రముఖ నటి డయానా రిగ్ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 82 సంవత్సరాలు.  గత కొంతకాలంగా క్యాన్సర్​తో బాధపడుతన్న ఆమె గురువారం మృతి చెందారు. డయానా తన కుటుంబసభ్యుల మధ్య ప్రశాంతంగా ఈ లోకాన్ని వీడారని డయానా ప్రతినిధి సిమాన్ బేర్స్ ఫోర్డ్ పేర్కొన్నారు. “గత నెలంతా అమ్మ చాలా ఆనందంగా గడిపారు, ఆమెను చాలా మిస్ అవుతున్నాను” అని డయానా కుమార్తె స్టెర్లింగ్ వెల్లడించారు.

1969లో జేమ్స్ బాండ్​ సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించిన డయానా రిగ్  అందాల నటిగా కుర్రకారును ఉర్రూతలూగించారు. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించి, సినీ ప్రేమికుల్ని అలరించారు. ‘అవెంజర్స్’, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్​​లోనూ ఆమె కీలక పాత్రలు పోషించారు. డయానా మృతికి హాలీవుడ్ ప్రముఖులు పలువురు సంతాపం తెలిపారు.

Also Read :

అభిమాని ఆకస్మిక మరణం.. గుండె పగిలింది అంటూ మహేష్ ట్వీట్

 రోజూ గోమూత్రం తాగుతా : అక్షయ్ కుమార్