మృతదేహాల్లో 18 గంటల పాటు వైరస్ సజీవం..

కరోనాతో మరణించిన వారి మృతదేహాల్లో 18 గంటల పాటు కరోనా వైరస్ సజీవంగా ఉంటుందని బెంగళూరులోని ఆక్స్‌ఫర్డ్‌ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు.

  • Ravi Kiran
  • Publish Date - 12:22 pm, Sun, 25 October 20
Autopsy on COVID-19 body

Autopsy on COVID-19 body: కరోనాతో మరణించిన వారి మృతదేహాల్లో 18 గంటల పాటు కరోనా వైరస్ సజీవంగా ఉంటుందని బెంగళూరులోని ఆక్స్‌ఫర్డ్‌ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. తాజాగా వారు కరోనాతో చనిపోయిన 62 ఏళ్ల వ్యక్తికి చేసిన శవ పరీక్షలో ఈ విషయాన్ని గుర్తించామని చెప్పుకొచ్చారు. అతడు మరణించిన తర్వాత 18 గంటల పాటు వైరస్ నోరు, గొంతు, ముక్కు ద్వారా సజీవంగా ఉందని వెల్లడించారు.

భారతదేశంలో ఇది మొట్టమొదటి శవపరీక్ష కాగా.. దీన్ని గతవారం ఫోరెన్సిక్ నిపుణుడు దినేష్ రావు చేపట్టారు. ”వ్యాధి ప్రక్రియను.. చికిత్స ప్రోటోకాల్‌పై అధ్యయనం చేసేందుకు ఈ శవపరీక్షను చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే వైరస్ ఊపిరితిత్తులను బాగా దెబ్బతీస్తుందని.. మిగిలిన అవయవాలపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. ఇలాంటి క్లినికల్ పరీక్షల ద్వారా ఈ విషయాలను తెలుసుకోవచ్చునని ఆయన చెప్పుకొచ్చారు.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్..