ఫోన్‌‌‌‌పే, గూగుల్ పే ద్వారా మరో సరికొత్త ఆప్షన్‌‌‌‌

డిజిటల్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న ఫోన్‌‌‌‌పే, గూగుల్ పే మరో సరికొత్త ఆప్షన్‌‌‌‌ను ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై యూపీఐ ద్వారా ఆటో డెబిట్ ఆప్షన్‌‌‌‌ను ఆఫర్ చేయాలని చూస్తున్నాయి. రెగ్యూలర్ పేమెంట్స్ అయిన ఎలక్ట్రిసిటీ, మొబైల్ ఫోన్‌‌‌‌ బిల్లులు, ఈఎంఐలు, మీడియా సబ్‌ స్క్రిప్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు వంటి నెలవారీ తప్పనిసరి పేమెంట్ల కోసం ఆటో డెబిట్ ఆప్షన్‌‌‌‌ను వినియోగదారులకు కల్పించనున్నారు.

ఫోన్‌‌‌‌పే, గూగుల్ పే ద్వారా మరో సరికొత్త ఆప్షన్‌‌‌‌
Follow us

|

Updated on: Aug 11, 2020 | 10:57 AM

డిజిటల్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న ఫోన్‌‌‌‌పే, గూగుల్ పే మరో సరికొత్త ఆప్షన్‌‌‌‌ను ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై యూపీఐ ద్వారా ఆటో డెబిట్ ఆప్షన్‌‌‌‌ను ఆఫర్ చేయాలని చూస్తున్నాయి. రెగ్యూలర్ పేమెంట్స్ అయిన ఎలక్ట్రిసిటీ, మొబైల్ ఫోన్‌‌‌‌ బిల్లులు, ఈఎంఐలు, మీడియా సబ్‌ స్క్రిప్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు వంటి నెలవారీ తప్పనిసరి పేమెంట్ల కోసం ఆటో డెబిట్ ఆప్షన్‌‌‌‌ను వినియోగదారులకు కల్పించనున్నారు. ఈ ఆప్షన్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఫోన్‌‌‌‌పే, గూగుల్ పేలు పనిచేస్తున్నాయని బ్యాంకర్లు చెప్పారు.

గూగుల్ పే, ఫోన్‌‌‌‌పేలు రికరింగ్ పేమెంట్స్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పై పనిచేయడం ప్రారంభించాయి. నెలలోనే ఇది అందుబాటులోకి రానుందని బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పేమెంట్ అప్లికేషన్స్‌‌‌‌ను లక్షల కొద్దీ యూజర్లకు ఆఫర్ చేయడాని కంటే ముందు వీటిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై గూగుల్ పే, ఫోన్‌‌‌‌పేలు స్పందిం చలేదు. హెచ్‌ డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లతో కలిసి జులైలోనే ఎన్‌‌‌‌పీసీఐ రికరింగ్ పేమెంట్ ఫెసిలిటీని లాంఛ్ చేసింది. సుదీర్ఘ కాలం నుంచి వేచిచూస్తోన్న ఈ పేమెంట్ ఫీచర్ యూపీఐ యూజర్ సెట్ చేసి తప్పనిసరిగా చేయాల్సిన రికరింగ్ పేమెంట్‌‌‌‌కు అనుమతిస్తోంది. రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం, ఎన్‌‌‌‌పీసీఐ అభివృద్ధి చేసిన ఇన్‌‌‌‌స్టంట్ పేమెంట్ సిస్టమ్ రూ.2000 వరకు రికరింగ్ పేమెంట్లు మాత్రమే జరుపుకునే వీలుంటుంది.

ఇక, వ్యాపారులకు పేమెంట్స్ ప్రాసెస్‌‌‌‌ను సులభతరం చేసింది. 10కి పైగా బ్యాంక్‌‌‌‌లు ఈ పేమెంట్స్ ప్రాసెస్‌‌‌‌ను తెచ్చాయి. ఈ ఎకోసిస్టమ్‌‌‌‌లో మరిన్ని బ్యాంక్‌‌‌‌లు కూడా చేరబోతున్నట్లు సమాచారం. గూగుల్ పే, ఫోన్‌‌‌‌పేలు కూడా పెద్ద మొత్తంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ ఆప్షన్‌‌‌‌ను తెస్తున్నాయి. ఆటో డెబిట్ ఫీచర్ కోసం యూజర్లు ఒకసారి యూపీఐ పిన్ ద్వారా ట్రాన్సాక్షన్‌‌‌‌ను తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతినెల చెల్లించాల్సిన తేదీని ఎంపిక చేయాలి. ఆ తర్వాత రెగ్యులర్‌ గా ట్రాన్సాక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ప్రస్తుతం ఉన్న రూ.2,000 లిమిట్‌‌‌‌ను రెగ్యులేటరీ మరింత పెంచనుందని బ్యాంకర్లలో ఒకరు చెప్పారు.

మారుతున్న కాలానుగుణంగా ఆన్ లైన్ లావాదేవీలు పెరిగిపోయాయి. ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనం యూపీఐ ద్వారానే అధిక మొత్తంలో ట్రాన్సాక్షన్లు జరిపినట్లు వెల్లడవుతోంది. జూలైలో యూపీఐ 1.5 బిలియన్ ట్రాన్సాక్షన్స్‌‌‌‌ను రికార్డు చేశాయి. వీటి విలువ రూ.3 లక్షల కోట్లుగా ఉంది. దేశంలో డిజిటల్ చెల్లింపులలో గూగుల్, అమెజాన్ , ఫోన్ పే వంటి వాటి ద్వారా జరిపేవే ఎక్కువ అవుతున్నాయి. దీంతో అమెజాన్, గూగుల్, ఫేస్‌‌‌‌బుక్ లాంటి గ్లోబల్ టెక్నాలజీ ప్లేయర్లు ఇటు వైపు చూస్తున్నాయి.

స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం