Agasthya Kantu

Agasthya Kantu

Reporter - TV9 Telugu

Agasthya.kantu@tv9.com

గత 11 ఏళ్ల గా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా ప్రమాణం చేస్తున్న నేను తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కీలకమైన రాజకీయ పరిణామాలు దగ్గరగా కవర్ చేసిన అనుభవం తో వార్తలు రాస్తున్నాను. మూడు పార్లిమెంట్ ఎన్నికలు, వివిధ రాష్ట్రాలకు చెందిన 7 అసెంబ్లీ ఎన్నికలు క్షేత్ర స్థాయిలో దగ్గర నుండి చూసిన అనుభవం తో రాజకీయ వార్తలు, లోతైన విశ్లేషణ తో వార్తలు రాస్తాను. Tv9 లో స్పెషల్ కరస్పాండెంట్ గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న.. గతంలో hmtv లో రిపోర్టర్ గా పనీ చేసా..

Read More
Follow On:
AP News: ఎన్నో ఏళ్ల కల సాకారమైన వేళ..ఆ గ్రామస్థులు కలెక్టర్‎కు ఇచ్చిన బహుమతి ఇదే..

AP News: ఎన్నో ఏళ్ల కల సాకారమైన వేళ..ఆ గ్రామస్థులు కలెక్టర్‎కు ఇచ్చిన బహుమతి ఇదే..

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదల సమయాల్లో వంతెనలు లేక గత కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు వివిధ గ్రామాల ప్రజలు. వరద సమయంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. తమ ఇబ్బందులను పలుసార్లు పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల.. లంక గ్రామాలకు వెళ్లే రహదారి పనులకు పెద్దపీట వేశారు.

AP Elections: ఏపీలో రేవంత్‌ రెడ్డి ప్రచారం చేస్తారా.? అసలేం జరగనుంది..

AP Elections: ఏపీలో రేవంత్‌ రెడ్డి ప్రచారం చేస్తారా.? అసలేం జరగనుంది..

అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్, మంత్రి సీతక్క లాంటి వాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారనే ప్రచారం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీకి వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తారా ? చేతులు ఎత్తేస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎవరెవరితో ఎక్కడ ప్రచారం...

Telangana: గవర్నర్ ‘ఎట్ హోం’‎కు బీఆర్ఎస్ దూరం.. అసలు కారణం ఇదే?

Telangana: గవర్నర్ ‘ఎట్ హోం’‎కు బీఆర్ఎస్ దూరం.. అసలు కారణం ఇదే?

గవర్నర్ తమిళిసై ఆహ్వానం మేరకు రాజ్‌భవన్‌లో జరిగిన 'ఎట్ హోం’ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. చాలా కాలం తర్వాత గవర్నర్ 'ఎట్ హోం’ లో రాజకీయ సందడి నెలకొంది. గత ప్రభుత్వంలో గవర్నర్‎కు - మాజీ సీఎం కేసీఆర్‎కు మధ్య ఉన్న దూరం వల్ల 'ఎట్ హోం’ కు బీఆర్ఎస్ దూరం ఉంటూ వచ్చింది.

Revanth Reddy: ప్రజా ఆరోగ్యం, ప్రజా రవాణాకు పెద్ద పీట.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

Revanth Reddy: ప్రజా ఆరోగ్యం, ప్రజా రవాణాకు పెద్ద పీట.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

వాయు కాలుష్యం ఇదొక సైలెంట్ కిల్లర్. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మరణాలకు దారి తీస్తుంది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింత ఎక్కువవుతోంది. మరింత భయంకరమైన విషయం ఏమిటంటే, వాయు కాలుష్యం కేవలం శ్వాసకోశ సమస్యలకు కారణం కాదు. ఇది ఇతర వ్యాధులతో ముడిపడి ఉంది. వాటిలో కొన్ని ప్రాణాంతకమైనవి.

Chevella Parliament: ఈసారి చేవెళ్ల పార్లమెంట్‎ బరిలో నిలిచేదెవరు.. గెలిచేదెవరు..?

Chevella Parliament: ఈసారి చేవెళ్ల పార్లమెంట్‎ బరిలో నిలిచేదెవరు.. గెలిచేదెవరు..?

వికారాబాద్ జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు.. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల అసెంబ్లీ స్థానాలు.. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. పాతిక లక్షల మంది ఓటర్లున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి జైపాల్ రెడ్డి గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయం సాధించారు.

Telangana Congress: ఆ ఎన్నికలపై కాంగ్రెస్ నజర్.. రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టాస్క్ ఇదే..

Telangana Congress: ఆ ఎన్నికలపై కాంగ్రెస్ నజర్.. రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టాస్క్ ఇదే..

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎక్కువ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

CM Revanth Reddy: మూసి నదిపై ప్రభుత్వం కొత్త ప్లాన్.. హైదరాబాద్ ఎలా మారబోతుందంటే..

CM Revanth Reddy: మూసి నదిపై ప్రభుత్వం కొత్త ప్లాన్.. హైదరాబాద్ ఎలా మారబోతుందంటే..

మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమైన విజన్‎లో ఒకటి. ఎన్నికల ముందు నుండి దీనిపై రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సీఎం హోదాలో దీనిపై ఫోకస్ పెంచారు. రాబోయే 36 నెలల్లో మూసి పరివహం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అందులో భాగంగా తొలుత హైదరాబాద్ నగరం పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్దేశించారు.

Malkajgiri Lok Sabha Election: తెలంగాణలో హాట్ సీట్‌.. ఈ సారి మల్కాజ్‌గిరి ‘బాద్‌ షా’ ఎవరు..? పోటీకి సై అంటున్న ఆ నేతలు..

Malkajgiri Lok Sabha Election: తెలంగాణలో హాట్ సీట్‌.. ఈ సారి మల్కాజ్‌గిరి ‘బాద్‌ షా’ ఎవరు..? పోటీకి సై అంటున్న ఆ నేతలు..

Malkajgiri Lok Sabha constituency: సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. నెక్ట్స్ అక్కడ ఎవరు పోటీ చేస్తారు ? రాజకీయ పక్షాల లెక్కలేంటీ ? కాంగ్రెస్ సిట్టింగ్ సీటును కాపాడుకుంటుందా ? పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో పట్టు నిలుపుకుంటుందా ? పట్టణ ప్రాంత ఓటర్లు తమవైపు నిలుస్తారని ఆశలు పెట్టుకున్న బీజేపీ ఉనికి చాటుకుంటుందా ? మల్కాజిగిరిలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి..? అనేది ఆసక్తికరంగా మారింది.

Telangana: సామాన్యుడిగా వచ్చి సోషల్ మీడియాలో చక్రం తిప్పుతూ.. తెలంగాణ ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున ప్రచారం

Telangana: సామాన్యుడిగా వచ్చి సోషల్ మీడియాలో చక్రం తిప్పుతూ.. తెలంగాణ ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున ప్రచారం

ప్రదీప్ ఈశ్వర్ పేరు గుర్తుందా ? ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో "చిక్ బళ్ళాపూర్ " నియోజకవర్గం నుంచి అత్యంత బలవంతుడైన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిని ఓడించి, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇతని గెలుపు రాజకీయ విశ్లేషకులను సైతం నివ్వెరపోయేలా చేసింది. "మనల్ని ఎవడ్రా ఆపేది " అనే పవన్ కళ్యాణ్ డైలాగ్ తో తన ప్రచారాన్ని ప్రారంభించారు.  తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చిక్కబళ్ళాపూర్ నియోజకవర్గంలో ఒక వూపు ఊపాడు.

Adaa: ప్రపంచ రెస్టారెంట్‌లో ఫలక్ నుమాలోని అదా రెస్టారెంట్‌కు మూడవ స్థానం.. గర్వం అంటున్న హైదరాబాదీ వాసులు

Adaa: ప్రపంచ రెస్టారెంట్‌లో ఫలక్ నుమాలోని అదా రెస్టారెంట్‌కు మూడవ స్థానం.. గర్వం అంటున్న హైదరాబాదీ వాసులు

ఫలక్నామాలోని ఇంజిన్ బౌలీలో ఉన్న ఈ రెస్టారెంట్ హైదరాబాదీ వంటకాల్లో ప్రత్యేకత కలిగి ఉంది.  భారతదేశంలోని ఉత్తమ రెస్టారెంట్ జాబితాలో ఢిల్లీ కి చెందిన ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్ ముందు ఉండగా బెంగళూరులోని కరవల్లి తర్వాత స్థానంలో ఉంది. ఈ విధంగా భారత దేశంలో మొత్తం టాప్ 10 రెస్టారెంట్లు ఉన్నాయి. అందులో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఫలక్నామాలోని అదా రెస్టారెంట్ చోటు తగ్గించుకోవడంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు హైదరాబాద్ వాసులు.

Telangana: రేపే కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలు ఇవే

Telangana: రేపే కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలు ఇవే

ఏపీ తరహా వాలంటరీ వ్యవస్థ , విద్య, వైద్యంకు పెద్దపీట లాంటి అంశాలను మ్యానిఫెస్టోలో చేర్చిందట కాంగ్రెస్. జర్నలిస్టులతో పాటు ఉమెన్ స్టూడెంట్స్‌కు మెట్రో ప్రయాణం ఉచితంగా ఇవ్వనుందట కాంగ్రెస్. ఇవి మాత్రమే కాకుండా యువ న్యాయవాదులకు మొదటి మూడేళ్ళు ప్రభుత్వం నుంచి కొంత సహాయాన్ని అందించే స్కీంను మ్యానిఫెస్టో లో చేర్చారట.

Telangana: హెలికాప్టర్ల కోసం మన నాయకులు ఇంత ఖర్చు చేస్తున్నారా.? ఒక్క ట్రిప్‌కు..

Telangana: హెలికాప్టర్ల కోసం మన నాయకులు ఇంత ఖర్చు చేస్తున్నారా.? ఒక్క ట్రిప్‌కు..

ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో జాతీయస్థాయి నేతలందరూ ఇప్పటికే తెలంగాణలో పర్యటిస్తున్నారు. అటు బీజేపీ మొదలుకొని కాంగ్రెస్ స్థానిక బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకుల సైతం పర్యటించాల్సి వస్తే ప్రైవేట్ హెలికాప్టర్లను వాడుతున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో ప్రైవేట్ హెలికాప్టర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. కొన్ని సందర్భాల్లో గంటల వ్యవధిలోనే నేతలు వేరే ప్రాంతానికి...