సింగిల్ డోస్‌తో క‌రోనా ఖ‌తమ్ ! త్వ‌ర‌లోనే అందుబాటులోకి..

ఒక సింగిల్‌ డోస్‌ యాంటీ పారాసైటిక డ్రగ్‌ ఇస్తే కరోనా వైరస్‌ మానవ శరీరంలో 48 గంటల్లోనే పూర్తిగా నశించిపోతోందని పరిశోధనల్లో వెల్లడైంది. కేవలం 24 గంటల్లోనే ..

సింగిల్ డోస్‌తో క‌రోనా ఖ‌తమ్ ! త్వ‌ర‌లోనే అందుబాటులోకి..
Follow us

|

Updated on: Apr 04, 2020 | 12:40 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైర‌స్‌ విలయ తాండవం చేస్తోంది. 200ల‌కు పైగా దేశాల్లో విస్త‌రించిన‌ మ‌హ‌మ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 11లక్షలకు చేరువలో ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 59వేల 140మంది కరోనాతో చనిపోయారు. వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 3,2020 ఒక్కరోజే  82వేల కొత్త కరోనా కేసులు నమోదవగా, 6వేల మంది మరణించారు. ఇంత‌టి ప్ర‌మాద‌కారి క‌రోనాను అరిక‌ట్టేందుకు వ్యాక్సిన్ త‌యారీ ప్ర‌క్రియ‌లో ప్ర‌పంచ దేశాలు నిర్విరామంగా శ్ర‌మిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే క‌రోనాను అంతం చేయ‌గ‌ల వ్యాక్సిన్‌ను క‌నుగోన్నారు అక్క‌డి శాస్త్ర‌వేత్త‌లు.వారు త‌యారు చేసిన వ్యాక్సిన్‌తో కేవ‌లం 48 గంట‌ల్లోనే క‌రోనా నాశ‌నం అవుతుందంటున్నారు. ఇప్ప‌టికే ప్రి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ స‌క్సెస్ అయిన‌ట్లుగా తెలిపారు. జంతువుల్లో విజ‌య‌వంతంగా దీనిని ప్ర‌యోగించిన‌ట్లుగా తెలిపారు.అతి త్వ‌ర‌లోనే వ్యాక్సిన్‌ను ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆస్ట్రేలియాలోని మొనాష్‌ బయోమెడిసిన్‌ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు మరో ప్రఖ్యాత సంస్థ పీటర్‌ డొయర్టీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షన్‌ అండ్‌ ఇమ్యూనిటీ వారు సంయుక్తంగా నిర్వ‌హించిన‌ పరిశోధనల్లో వివ‌రాలు వెల్ల‌డించారు.

ఒక సింగిల్‌ డోస్‌ యాంటీ పారాసైటిక డ్రగ్‌ ఇస్తే కరోనా వైరస్‌ మానవ శరీరంలో 48 గంటల్లోనే పూర్తిగా నశించిపోతోందని పరిశోధనల్లో వెల్లడైంది. కేవలం 24 గంటల్లోనే ఈ యాంటీ పారాసైటిక డ్రగ్‌ డోస్‌ వల్ల కరోనా వైరస్‌ ప్రభావం గణనీయంగా తగ్గిపోతోందని కూడా శాస్త్రజ్ఞులు గమనించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్‌ అందరికీ అందుబాటులోనే ఉంది. అయితే, ఎంత శాతంతో దీని డోస్‌ కచ్చితంగా ఇవ్వాలనే అంశంపై మాత్రం ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ల్యాబ్‌లో జరిగిన పరీక్షల్లో మాత్రం ఈ డ్రగ్‌తో కరోనాను సంపూర్ణంగా కట్టడి చేయవచ్చునని స్పష్టమైందని ఆస్ట్రేలియాలోని మొనాష్‌ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న మొనాష్‌ బయోమెడిసిన్‌ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది.

ఒక సింగిల్‌ డోస్‌తోనే కరోనా ఆర్‌ఎన్‌ఎ మొత్తం తొలగిపోతుందని సంస్థకు చెందిన డాక్టర్‌ కైలీ వాగ్‌స్టాఫ్‌ వెల్లడించారు. యాంటీ పారాసైటిక డ్రగ్‌ ఐవర్‌మెక్టిన్‌ వల్ల కరోనా వ్యాప్తి పూర్తిగా ఆగిపోతోందని తెలిపారు. అయితే, ఇది ఏవిధంగా కట్టడి చేసి నశింపచేస్తోందో ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఇప్పుడు శాస్త్రజ్ఞుల ముందు ఉన్న అంశం ఏ వెూతాదులో ఈ డ్రగ్‌ డోస్‌ మానవులకు ఇస్తే ఎటువంటి ప్రమాదం ఉండదో కనిపెట్టడమేనని చెప్పారు. ఐవర్‌మెక్టిన్‌ ప్రపంచవ్యాప్తంగా అనుమతులు ఉన్న డ్రగ్‌ అని, దీన్ని ఇప్పటికే హెచ్‌ఐవి, డెంగీ, ఇన్‌ఫ్లూయంజాలకు వ్యతిరేకంగా వాడుతున్నట్టు తెలిపారు.

మరికొన్ని రోజుల్లోనే క్లినికల్‌ టెస్ట్‌లు పూర్తి చేసుకుని వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి షాంఘైలో జంతువులపై పరిశోధనలు విజయవంతంగా జరిగాయి. కరోనా సోకిన బాధితుల వాస్తవ సంఖ్యపై విరుద్ధమైన వాదనలు ఉన్నప్పటికీ బాధితుల్లో రెండు శాతం వరకూ చనిపోతున్నారన్నది వాస్తవమని శాస్త్రజ్ఞులు అంటున్నారు. వ్యాక్సిన్‌ సిద్ధం చేయడానికి అగ్రరాజ్యాలు ఇప్పటికే భారీగా నిధులు కేటాయించాయి. కాగా, ఫ్లూ, సార్స్‌ వైరస్‌ల వలె కరనా కూడా సీజనల్‌ వ్యాధిగా మారే ప్రమాదం ఉందని, అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా రుతువులను బట్టి వైరస్‌ ప్రబలే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.