అప్పుడు జైపూర్‌లో.. ఇప్పుడు సిడ్నీలో.. ఆసిస్ జట్టులో ఏ ఒక్కరూ తగ్గలేదుగా…!

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో ఆసిస్ జట్టు అరుదైన ఘనత సాధించింది.

అప్పుడు జైపూర్‌లో.. ఇప్పుడు సిడ్నీలో.. ఆసిస్ జట్టులో ఏ ఒక్కరూ తగ్గలేదుగా...!
Follow us

|

Updated on: Nov 29, 2020 | 4:09 PM

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో ఆసిస్ జట్టు అరుదైన ఘనత సాధించింది. టీమ్‌లో ఐదుగురు ప్లేయర్లు 50కి పైగా పరుగులు చేసి రెండోసారి చరిత్ర సృష్టించారు. ఆ జట్టుకు చెందిన టాప్ 5 బ్యాట్స్‌మెన్ వార్నర్, ఆరోన్ ఫించ్, స్మిత్, లక్సెంబర్గ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 50కి పైగా పరుగులు చేశారు. అయితే 2013లో జైపూర్‌లో జరిగిన వన్డేలో టీమిండియాపై ఆసిస్ బ్యాట్స్‌మెన్ 50కి పైగా పరుగులు చేసి తొలి రికార్డ్‌ను నమోదు చేయగా, ఇప్పుడు రెండోసారి అలాంటి రికార్డునే నమోదు చేశారు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసిస్ ప్లేయర్లు రెచ్చిపోయారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతా తమ బ్యాట్లను ఝుళిపించారు. బ్యాటింగ్ చేసిన ఐదుగురు ప్లేయర్లూ 50కి పైగా పరుగులు చేసి టీమిండియాకు భారీ లక్ష్య చేధనను నిర్ధేశించారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ నిలకడగా ఆడుతూనే దూకుడు ప్రదర్శించారు. డేవిడ్ వార్నర్ 77 బంతుల్లో 83 పరుగులు చేయగా, ఆరోన్ ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులు చేసి ఆసిస్‌ జట్టుకు శుభారంభం అందించారు. ఇక స్టీవ్ స్మిత్ మరోసారి తన బ్యాట్‌ను ఝుళిపించాడు. 64 బంతుల్లో 14×4,2×6తో 104 పరుగులు చేసి దుమ్మురేపాడు. వీరితో పాటు లక్సెంబర్గ్ 61 బంతుల్లో 70 పరుగులు, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 29 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టు స్కోరును భారీగా పెంచారు. ఇలా ఈ ఐదుగురు ప్లేయర్లు 50కి పైగా పరుగులు చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. కాగా, నిర్ణీత 50 ఓవర్లలో 389/4 పరుగులు చేసిన కంగారూలు టీమిండియా 390 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు.