రాంచీ వన్డే: భారత్ లక్ష్యం 314 పరుగులు

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా రాణించింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌ (93; 99 బంతుల్లో 10×4, 3×6), ఉస్మాన్ ఖవాజా (104; 113 బంతుల్లో 11×4, 1×6) భారీ స్కోర్లతో రాణించడంతో కోహ్లీసేన ముందు 314 పరుగుల లక్ష్యం ఉంచింది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (47; 31 బంతుల్లో 3×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మార్కస్‌ స్టాయినిస్‌ (31), అలెక్స్‌ కారీ (21) ఫర్వాలేదనిపించారు. […]

రాంచీ వన్డే: భారత్ లక్ష్యం 314 పరుగులు
Follow us

|

Updated on: Mar 08, 2019 | 5:44 PM

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా రాణించింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌ (93; 99 బంతుల్లో 10×4, 3×6), ఉస్మాన్ ఖవాజా (104; 113 బంతుల్లో 11×4, 1×6) భారీ స్కోర్లతో రాణించడంతో కోహ్లీసేన ముందు 314 పరుగుల లక్ష్యం ఉంచింది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (47; 31 బంతుల్లో 3×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మార్కస్‌ స్టాయినిస్‌ (31), అలెక్స్‌ కారీ (21) ఫర్వాలేదనిపించారు. కుల్‌దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు తీశాడు.