ఐసీసీ వరల్డ్ కప్ 2019: కష్టాల్లో ఆస్ట్రేలియా… 20 ఓవర్లకు 83/5

Australia, ఐసీసీ వరల్డ్ కప్ 2019: కష్టాల్లో ఆస్ట్రేలియా… 20 ఓవర్లకు 83/5

ప్రపంచకప్‌లో భాగంగా విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. విండీస్ బౌలర్ల దాటికి విలవిల్లాడుతోంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌ ఆసీస్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. కెప్టెన్ నిర్ణయం సరైనదేనని బౌలర్లు నిరూపించారు. 15 పరుగులకే ఆసీస్ కెప్టెన్/ఓపెనర్ అరోన్ ఫించ్ (6)ను ఒషాన్ థామస్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత మరో 11 పరుగులకే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(3)ను కాట్రెల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కూడా ఆసీస్ వికెట్ల పతనం కొనసాగింది. 36 పరుగుల వద్ద ఉస్మాన్ ఖావాజా(13) అవుటవగా, మరో రెండు పరుగుల తేడాతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం 20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ 16, మార్కస్ స్టోయినిస్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *